మీ శరీరం

స్వీయ రక్షణ

- రోజూ నడవండి. నడక వలన మీకు స్వాంతన కలుగుతుంది. మీ స్నేహితులు ఎవరైనా గనుక ఉంటే వారిని మీతో పాటు రమ్మని పిలవండి. నడవటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు.
- మీరు ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు పాదాలకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. దీని వల్ల కాళ్లు నొప్పులు రాకుండా ఉంటాయి.
- రాత్రి నిద్రలో మీరు విపరీతమైన నొప్పులతో లెగిస్తే పిక్క, కండరాలు నొక్కి మర్దనా చేసుకుంటు కాలివేళ్ళను లాగండి.
- చక్కెర లేని చూయింగ్ గమ్ నమలండి. భోజనం తర్వాత ఇలా చేయటం వలన గుండెల్లో మంట రాదు.
- కుదిరినప్పుడల్లా బయటకి వెళ్లి గాలి పీల్చుకోండి. మూసుకుపోయిన, బాగా సామానం ఉన్న గదిలో ఉండొద్దు. దీని వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
మీ వైద్యుడిని అడగండి

- రెండవ త్రైమాసికంలో చేయవలసినవి మరియు చేయకూడని పనులు ఏమిటి?
- ఏమేమి స్క్రీనింగ్ పరీక్షలు ముఖ్యమైనవి?
- అప్పుడప్పుడు రక్తపు మరకలు గమనిస్తున్నాను. అది సహజమేనా?
- నేను చాల వరకు సంతోషంగా కంటే దుఃఖం గానే ఉంటున్నాను. ఆనందంగా ఉండాలి అనుకున్న ఉండలేకపోతున్నా. నేను ఎవరినైనా నిపుణులను సంప్రదించి మరింత జాగ్రత్త తీసుకోవాలా?
- నేను సరైన మోతాదులో బరువు పెరుగుతున్నానా? నా పొట్టని చుస్తే ఇతర గర్భిణీ స్త్రీ పొట్ట లాగా పెద్దగా లేదు!
మీకు ప్రశ్నలు ఉండవచ్చు
నాకు ఎప్పుడూ నలతగా మనసు ఏమి బాగోలేకుండా ఉంటుంది. ఇది ఏమి కూడా అసాధారణమైన విషయం కాదు. కొన్ని ఆందోళనలు. భయాలు ఉండటం సహజం. మీ గురించి మీరు అతిగా ఆశలు పెంచుకోవద్దు. మీరు ఏమి చేయగలరు అనేది వాస్తవం గా ఉండండి. విశ్రాంతి తీసుకోండి. ఎవరితో మాట్లాడితే మీ మనసుకు ఆహ్లాదంగా, మంచిగా అనిపిస్తుందో వాళ్లతో రోజూ కొంత సమయం గడపండి.
ప్రతి 10 మంది గర్బిణీలలో 1 కి ఏ ఈ విధమైన డిప్రెషన్ ఉంటుంది. ఇతర తల్లులతో లేదా పెద్దవారితో మాట్లాడండి. మీకు అయినా రోజు రోజుకి మీ మానసిక స్థితి పెరుగుతూ ఉండడం వంటివి గమనిస్తే మీ యొక్క జనరల్ ఫిజిషియన్ Doctor) ని కలసి వారితో మాట్లాడండి.
“నేను నీలాగా చిన్న చిన్న వాటికి ఏడ్చేదాన్ని. షాప్ కి వెళ్ళినపుడు పిల్లల బట్టలు, వస్తువులు చూసినపుడు ఏడవడం చేసేదాన్ని. ఈ సమయంలో మానసిక స్థితి బాగోలేకపోవటం, భావోద్వేగాలకు గురి కావడం సహజం. అది గర్భసమయంలో ఏర్పడే హార్మోన్ల యొక్క కారణం!”