నీ శరీరం

ఏమి ఆశించను
మీకు ఈ సమయంలో కటి ఎముక (నడుము కింద భాగం ) ప్రాంతంలో నొప్పి మొదలవుతుంది. ఒకవేళ అక్కడ తీవ్రమైన నొప్పి పుట్టినా అది ప్రమాదకరమైనది కాదు. మీరు పెంగ్విన్ లా కానీ బాతుల కానీ నడుస్తారు. మీరు ఇప్పుడు చాలా బరువు పెరుగుతారు. సుమారు వారానికి 400 గ్రాములు వరకు పెరుగుతారు. మీరు బ్రాక్స్టన్ హిక్స్ సంకోచాలు అనుభవిస్తారు - అనగా గర్భసంచి గట్టిగా మారి పిండినట్లుగా ఉంటుంది. మీరు స్థానం మార్చినప్పుడు అవి తగ్గుతాయి. మీకు చాలా స్పష్టంగా విచిత్రమైన కలలు కంటారు నిద్రలో. పగటి కలలు కూడా వస్తాయి.
మీ శిశువు

ఏమి ఆశించను
బిడ్డ మామూలుగా గర్భంలో తన తలని కిందకి ఉంచి శరీరము పైకి పెడుతుంది. ఒకవేళ అలా జరగకపోతే నెమ్మదిగా తిరుగుతుంది. ఏం పర్వాలేదు. బిడ్డ యొక్క పెద్ద అవయవాలు పూర్తిగా తయారయి ఒక ఊపిరితిత్తుల మాత్రం ఇంకా తయారీ లోనే ఉన్నాయి. బిడ్డ మూత్రం పోస్తుంది. బయట ప్రపంచంలోకి వచ్చాక బ్రతకడానికి సాధన చేస్తుంది. మింగడం, గాలి పీల్చుకోవడం, చీకడం, తన్నడం మొదలగునవి.
స్వీయ రక్షణ

సూచనలు
- తరచుగా విశ్రాంతి తీసుకోండి. అలా చేయడం వల్ల మీకు వచ్చే అలసట తగ్గడానికి ఉపయోగపడుతుంది.
- ఇకపై చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మీరు కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు పోషకాహారం తీసుకుంటున్నారా అని గమనించుకోవాలి. ఎందుకంటే మీకు, మీ బిడ్డకి ఇద్దరికీ అది అవసరం. నెమ్మదిగా మీకు ఆకలి తగ్గి పోవచ్చు.
- నెలలు నిండకుండా జరిగే కాన్పుల గురించి తెలుసుకోండి. ఒకవేళ ఈ సమయంలో కాన్పు జరిగిన పుట్టిన బిడ్డ బ్రతకడానికి మరియు ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంది. అందరిలానే సాధారణమైన జీవితం గడుపుతారు.
- అనుకున్న దానికంటే ముందుగా జరిగే ప్రసవం గురించి జాగ్రత్తగా ఉండాలి.
- మీరు ప్రసవానంతరం ఉండే మీ పరిస్థితి గురించి కూడా గమనించుకోండి - అనగా బహుశా మీకు కుట్లు ఉండవచ్చు, మరుగుదొడ్డి కి వెళ్ళవలసి రావచ్చు మరియు రక్త స్రావం వంటి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.
మీ డాక్టర్ని అడగవలసినవి
మీరు చేయవలసిన జాబితా

యాక్షన్ పాయింట్లు
- హాస్పిటల్ లో చేరడానికి ముందుగానే నేను నా ప్రసవానికి సంబందించిన సామానులు / బ్యాగ్ ను సిద్ధం చేసుకోవాలి.
- ఐరన్ టాబ్లెట్లు మరియు విటమిన్ మాత్రలను వాడుకోవాలి.
- కుషల్ వర్కుషాపు లో సమయం బుక్ చేసుకోవాలి.
- డాక్టర్ దగ్గర చెకప్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలి.
- ఎలాంటి గుర్తులు కనపడితే నేను జాగ్రత్త పడాలో తెలుసుకోవాలి.
- నేను డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవలసిన విషయాలను రాసి పెట్టుకోవాలి.
బహుశా మీకు కలిగే ఇతర ప్రశ్నలు
డెలివరీ అయ్యే సమయానికి లోపలి బిడ్డ ఏ స్థానంలో ఉండాలి?
"బిడ్డ తనంతట తానుగా స్థానం మార్చుకుంటుంది. డెలివరీకి అనుగుణంగా తల కింది వైపు శరీరం పైకి పెడుతుంది. ఎందుకంటే బయటికి రావడానికి అదే సులభమైన పద్ధతి. తలకిందులుగా తిరగటం అనేది చివరిలో జరుగుతుంది. ముప్పై ఆరవ వారంలో మా చంటిది తిరగకపోయేసరికి బిడ్డను తిప్పడానికి ప్రయత్నించారు. ఒక్కొక్కసారి బయటికి బిడ్డ కాళ్లు రావచ్చు."
ఎటువంటి గుర్తులు మరియు లక్షణాలకు నేను జాగ్రత్త వహించాలి ?ఇంకా దేనికి భయపడాల్సిన వస్తుంది?
"ఈ పరిస్థితిలలో మీ డాక్టర్ ని వెంటనే కలవాలి -
- ఒకవేళ నొప్పి ,వాపు ఎరుపుదనం, కాలి పిక్క భాగంలో వస్తే.
- ఛాతి భాగంలో నొప్పిగా ఉండి ఊపిరి తీసుకోలేక పోతుంటే.
- ఉన్నట్లుండి యోని నుంచి చాల ఎక్కువగా రక్తస్రావం జరగడం, కళ్ళు తిరగడం ఇంకా గుండె దడగా అనిపించడం.
- జ్వరం, కడుపులో నొప్పి, తలనొప్పి.
- చూపులో మార్పులు రావడం మరియు వాంతులు అవ్వడం ఇలాంటి లక్షణాలు ఉన్న వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి."