మీ శరీరం

ఏమి ఆశించాలి
- మీరు ఈ వారంలో మీ బిడ్డను కలవడానికి అవకాశం ఉంది! చాల మంది 38 నుండి 42 వరాల మధ్య ప్రసవం అవుతారు.
- మీరు కొంచెం విసుగుగా లేదా కోపంగా ఉంటారు. ఎందుకంటే మీరు ఏంటో కలం ఎదురుచూస్తున్నారు అయినా ఇంకా కొంత దూరం ( కొన్ని రోజులు) ఉంది కాబట్టి!
- మీ శరీరం ఆ రోజు కోసం సిద్దమవుతు ఉంటుంది
- మీ బిడ్డ సెర్వెక్స్ లోనికి ( గర్భాశయపు ముందర భాగం) దిగుతుంది.
- నిద్రలేని రాత్రులు, కాస్తంత ఆత్రత, రొమ్ముల నుండి నీరు లాగా రావడం , మరియు విరేచనాలు వంటివి మీకు ఉండవచ్చు
మీ శిశువు

ఏమి ఆశించాలి
- బిడ్డ జన్మించడానికి సిద్ధంగా ఉంది.
- బిడ్డ యొక్క గొంతు కూడా తయారైంది. - బిడ్డ ఆమె లేదా అతడు ఇపుడు ఏడవగలడు!
- బిడ్డ కొంత ఉమ్మ నీటిని తాగుతుంది. ( గర్భసంచిలో ఉంటుంది) అదే బిడ్డ బయటకి వచ్చాక మొదటి విరేచనముగా వస్తుంది.
- బిడ్డ చిన్నదైనా కొన్ని ముఖ్యమైన మార్పులను చేసుకుంటుంది . అవి తన నాడి వ్యవస్థను పనిచేసేలా మారుస్తుంది."
స్వీయ రక్షణ

చిట్కాలు / సూచనలు
- మీకు ఏమైనా సందేహాలు, భయాలు ఉన్నా మరియు బిడ్డ కదలికలు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటె మీ డాక్టర్ తో ఏ సమయానికైనా ఫోన్ చేసి తెలుసుకోండి.
- ఏమి కంగారు పడవద్దు అలా వేళా మీ యొక్క ప్రసవ తేదీ ( ఎక్స్పెక్టెడ్ డేట్ అఫ్ డెలివరీ ) దాటిపోయినా. 5% మందికి మాత్రమే కచ్చితంగా అదే రోజు జరుగుతుంది.
- మీ బిడ్డ గురించిన ఆలోచనలు మానివేసి ప్రశాంతంగా మ్యాగజిన్ వంటివి చదవడం లేదా చిన్న వ్యాయామాలు వంటివి చేయండి.
- మోకాళ్ళు,కాళ్లు అలిసిపోకుండా నిదానంగా నడవండి. ఇలా నడవడం వలన బిడ్డ కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది.
ముఖ్యమైన చర్యలు

పాయింట్లు
- బిడ్డ యొక్క కదలికలను లెక్కించాలి.
- హాస్పిటల్ కి తీసుకువెళ్లవలసిన బాగ్‌ను ఒకసారి చెక్ చేసుకోవాలి.
- కుషల్ వర్కుషాపు నందు పాల్గొనడానికి సమయాన్ని చూసుకోవాలి.
- ఈ సమయంలో వాడవలిసిన ఫోలిక్ యాసిడ్ మరియు ఇతర విటమిన్ మాత్రలను క్రమంగా వాడుకోవాలి.
- డాక్టర్ వద్ద చెకప్ నిమిత్తం అప్పోయింట్మెంట్ తీసుకోవాలి.
- డెలివరీ నిమిత్తం వెళ్ళవలసిన హాస్పిటల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఉదాహరణకు రాత్రి పూట నొప్పులు వస్తే ఎటు వైపు గేట్ నుండి హాస్పిటల్ లోనికి వెళ్ళాలి అలాంటివి. "
మీకు ప్రశ్నలు ఉండవచ్చు
నాకు విరేచనాలు ( డయేరియా) అవుతున్నాయి. ఈ విషయం గురించి నేను కంగారు పడాలా?
అవును , నెలలు నిండిన తర్వాత ఇపుడు విరేచనాలు అవడం కంగారు పడాలి. ఎందుకంటే విరేచనాలు అవుతుంటే లోపల పేగులు కాళీ అయ్యి బిడ్డ తిరగడానికి స్థలం దొరుకుతుంది. అందువలన బిడ్డ కిందకి ఇముడుతుంది. దీనివలన ప్రసవం ఏ రోజైన కావచ్చు. నాకు మాత్రం డాక్టర్ ఈ సమయంలో ఎక్కువ నీళ్లు తాగమని ఇంకా బలమైన ఆహరం తీసుకోమని చెప్పారు.
నా కాళ్లు కొంచెం వాచాయి. నేను ఏమి చేయాలి?
కాళ్ళు వాయడం లేదా ఎడిమ ( నీరు రావడం) వంటివి 75% మంది గర్భిణీ స్త్రీలు సాధారణంగా 22 నుండి 27 మధ్య మొదలై ప్రసవం వరకు ఉంటుంది. కొంచెం వాపు రావడం అనేది సహజమే. ఒకవేళ చాల ఎక్కువగా గాని ఉంటె ఇది అధిక రక్తపోటుకు చిహ్నం. అందుకు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.