22వ వారం

మీ శరీరం

changes in the body
ఏమి ఆశించాలి
మీ రొమ్ములు నుండి ముర్రుపాలు వస్తుంటాయి. ఇది సర్వసాధారణం మీరు మీ శరీరంలో కొన్ని రకాల మార్పును గమనించవచ్చు. మీ చనుమొనలు చుట్టూ ఉన్న భాగం నలుపుగా మారడం, చర్మంపైన నల్లటి మచ్చలు వలయాలు ఏర్పడటం వంటివి. ఈ సమయంలో మూలశంక వ్యాధి అనగా మొలలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు చాలా నొప్పిగా ఉండవచ్చు మీ శరీరం అంతా కూడా నొప్పులు మరియు కాస్తంత సలపరం గా అనిపిస్తూ ఉంటుంది.

బిడ్డ పరిమాణం

Week 22 size image
ఏమి ఆశించాలి
మీ బిడ్డ కడుపులో ఒక పెద్ద క్యాప్సికం ( కూరగాయ) అంత పరిమాణంలో ఉంటుంది (సుమారుగా 27 cm పొడవు మరియు 410 గ్రాముల బరువు).

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించాలి
మీ గర్భంలో ఉన్న శిశువు ఇప్పుడు వెలుతురుకి చీకటికి తేడాలు కనుగొనగలదు. కావాలంటే మీరు మీ పొట్ట మీద టార్చ్ లైట్ వేసి చూడండి. శబ్దాలు వినడానికి ఆతృతగా ఉంటుంది. మరియు తేడాలు గమనిస్తూ ఉంటుంది. చిన్న చిన్న చెవులతో ఉంటుంది. ఈ సమయంలో ఊపిరితిత్తులు ఏర్పడుతూ ఉంటాయి. బిడ్డ జన్మించాక తనకే తాను ఊపిరి పీల్చుకోవడానికి సిద్ధం అవుతుంది ఇప్పుడు.

స్వీయ రక్షణ

Mission pageTaking care 2Our services page
చిట్కాలు / సూచనలు
 • పెల్విక్ (కటి ఎముక) సంబంధిత వ్యాయామాలు చేయండి. ఈ వ్యాయామాలు చేయటం వలన మీరు మీరు దగ్గినా నవ్వినా, ఏడ్చినా మీకు తెలియకుండా యోని నుండి వచ్చే స్రావాలు రాకుండా ఉంటాయి.
 • మీ భావనలు, భావోద్వేగాలు గురించి కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో మాట్లాడండి. ఆతృతగా ఉండటం ఈ సమయంలో సహజం !
 • మీకు ఉన్న భయాందోళనలు గురించి మాతృత్వం గురించి మీ భర్త తో మాట్లాడండి.
 • మధ్య మధ్యలో ఆరోగ్యకరమైన చిరుతిండి తినండి.
 • బాగా నీళ్లు తాగండి. మరియు పీచు పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడదు. మరియు విరేచనం సాఫీగా అవుతుంది
 • నడుంనొప్పి కనుక ఉన్నట్లయితే నడుముకి మర్దన చేయించుకోండి.

మీ వైద్యుడిని అడగండి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. కోరింత దగ్గుకు ఏమైనా టీకాలు వేయించుకోవాల?
 2. నాకు చాలా నొప్పులు, సలపరాలు ఉన్నాయి? ఇవి సహజమేనా?
 3. నేను కొంచెం నొప్పితో కూడిన రక్త స్రావం గమనించాను? ఏమి చెయ్యాలి
 4. నేను నా రోజువారీ ఆహారంలో ఇతర పోషకాలు కలిగిన ఆహారం ఏమైనా తీసుకోవాలా?
 5. నా గర్భధారణ విషయంలో అంతా బాగుగానే ఉందా? నేను దీని గురించి అయినా పట్టించుకోవాల?

ముఖ్యమైన చర్యలు

Todoicon
పాయింట్లు
 1. అస్తమానం నా మాతృత్వం గురించి ఆలోచిస్తూ, దాని గురించి మాట్లాడకుండా ఇష్టమైన టీవీ కార్యక్రమాలు చూడాలి.
 2. గంటల కొద్దీ కూర్చోవడం, నుంచోవడం వంటివి చేయకుండా కాసేపు కాళ్లనీ మడత వేసుకుని కూర్చోవాలి.
 3. కుషల్ యాప్లో నమోదు అవ్వాలి
 4. కుషల్ యాప్ లో బరువు మరియు రక్తపోటు రికార్డ్ చెయ్యాలి
 5. స్వాంతన ఇచ్చే యోగాసనాలు నేర్చుకుని విశ్రాంతి పొందాలి.

మీకు ప్రశ్నలు ఉండవచ్చు

"నాకేమీ చెప్పారంటే మన శరీరంలో జరిగే రకరకాల మార్పుల వల్ల ఇటువంటివి జరగటం సర్వ సాధారణం. ఒంట్లో నీటి శాతం తక్కువ అయినపుడు కళ్ళు తిరగటం సహజం. ఇలా కళ్ళు తిరగటం చాలా రోజుల కొద్దీ కొనసాగితే మీకు రక్తహీనత ఏమైనా ఉందేమో అని డాక్టర్ దగ్గరకు వెళ్ళి చుపించుకోవాలి.
( లో బ్లడ్ సుగర్) రక్తం లో చక్కెర నిలువలు తక్కువ ఉండటం అనేది చాలా అరుదు. అది తేలికగా తగ్గించుకోవచ్చు."

"అది మీ గర్భాశయం డెలివరీ / కాన్పు కోసం తయారవుతుంది. వీటిని బ్రాక్ట్సన్ హిక్స్ సంకోచాలు అంటారు. అవి ఏమి ప్రమాదకరమైనవి కావు."

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి