19వ వారం

మీ శరీరం

changes in the body
ఏమి ఆశించాలి
మీరు దాదాపుగా సగం దూరం వచ్చేశారు. ఇప్పుడు త్వరగా నీరసపడిపోతారు. నిద్ర లేకపోవడం వల్ల మరియు అధిక బరువును మోయడం వల్ల బాగా కాళ్ల నొప్పులు వచ్చి సరిగ్గా నిద్ర పట్టదు. మామూలుగా కంటే కూడా ఎక్కువగా ఆకలి వేస్తుంది. మీకు ఇప్పుడు మూత్రాశయం లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి.

బిడ్డ పరిమాణం

Week 19 size guide
ఏమి ఆశించాలి
మీ బిడ్డ ఇప్పుడు ఒక మామిడికాయ అంత బరువు ఉంటుంది.(సుమారుగా 15 సెం. మి పొడవు మరియు 240 గ్రాముల బరువు ఉంటుంది)

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించాలి
మీ బిడ్డ యొక్క ఊపిరితిత్తులు పెరుగుతున్నాయి. మీ బిడ్డ లావుగా అవుతుంది. మీ బిడ్డ యొక్క శాశ్వత దంతాలు ఏర్పడుతాయి . బిడ్డ మీద తెల్లని జిగురు వంటి పొర ఏర్పడుతుంది. అది శరీర ఉష్ణోగ్రతను కాపాడుతుంది. దీనిని వెర్నిక్స్ పొర అని వైద్య భాషలో అంటారు.

స్వీయ రక్షణ

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 19వ వారం
చిట్కాలు / సూచనలు
 • మీ గర్భధారణ గురించి ఏమైనా భావాలు గురించి ఇతరులతో మాట్లాడండి/ పంచుకోండి ఎందుకంటే ఇలాంటి సమయంలో భయాలు , ఆందోళనలు ఉండడం చాలా సహజం
 • బాగా ఎక్కువ పనులు చేయకుండా తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. బయటికి వెళ్లినప్పుడు అందరితో సౌకర్యవంతంగా మాట్లాడండి.
 • మెడిటేషన్ సాధన చేయండి. మెడిటేషన్ అనగా ధ్యానం. మరియు మంచంలో పడుకున్నప్పుడు వ్యాయామం చేయుట కూడా మీకు మంచిగా నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది.
 • పడుకునేటప్పుడు మోకాళ్ల మధ్య దిండు పెట్టుకోండి . దీని వల్ల మీకు నొప్పి, బాధ తగ్గుతుంది.
 • ఎక్కువగా బరువులు లేపకూడదు. వేరొకరి సహాయం తీసుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎత్తవలసి కనుక వస్తే మోకాళ్ళను వెడల్పుగా పెట్టి నడుము వంచకుండా మెల్లగా చేతులు, కాళ్ల సహాయంతో బరువుని లేపాలి . నడుముని సహాయంగా తీసుకోవద్దు అలాగే నడుముని వంచొద్దు.

మీ వైద్యుడిని అడగండి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. నాకు తెల్లబట్ట అవుతుంది అది ఏమైనా ఈస్ట్ ఇన్ఫెక్షన్ ? దానికి సరైన చికిత్స ఏమిటి?
 2. ఎక్కువగా బాత్రూంకి వెళ్ళవలసి వస్తుంది. ఇంకా మంటగా కూడా అనిపిస్తుంది. నాకు ఏమైనా మూత్రాశయం ఇన్ఫెక్షన్ అనేది ఉందా?
 3. నా చను మొనల నుంచి ఏదో కారుతుంది. అది సాధారణమైన విషయమేనా?
 4. నాకు చాలా తక్కువ అనుభూతిగా మనసు ఏమి బాగోకుండా ఉంటుంది. నేను ఏమి చేయాలి?

ముఖ్యమైన చర్యలు

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 19వ వారం
పాయింట్లు
 1. ఫోలిక్ ఆసిడ్ మరియు విటమిన్ టాబ్లెట్లు వాడుకోవాలి.
 2. మీ యొక్క శ్రేయస్సు కోరే కుషల్ వర్క్ షాప్ లో సమయాన్ని బుక్ చేసుకోవాలి
 3. డాక్టర్ వద్దకు వెళ్లడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి
 4. మెడిటేషన్ సాధన చేయాలి
 5. మీ యొక్క డెలివరీకి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి

మీకు ప్రశ్నలు ఉండవచ్చు

నాకు తెలిసిన ఇతర గర్భవతులను చూస్తే ఎప్పుడు సంతోషంగా, ఆహ్లాదంగా కనిపిస్తారు. నాకు ఎందుకు అలాంటి అనుభూతి లేదా అనుభవించలేక పోతున్నాను?

” నాకు ఎప్పుడూ నలతగా మనసు ఏమి బాగోలేకుండా ఉంటుంది. ఇది ఏమి కూడా అసాధారణమైన విషయం కాదు. కొన్ని ఆందోళనలు. భయాలు ఉండటం సహజం. మీ గురించి మీరు అతిగా ఆశలు పెంచుకోవద్దు. మీరు ఏమి చేయగలరు అనేది వాస్తవం గా ఉండండి. విశ్రాంతి తీసుకోండి. ఎవరితో మాట్లాడితే మీ మనసుకు ఆహ్లాదంగా, మంచిగా అనిపిస్తుందో వాళ్లతో రోజూ కొంత సమయం గడపండి.”

ప్రతి 10 మంది గర్బిణీలలో 1 కి ఏ ఈ విధమైన డిప్రెషన్ ఉంటుంది. ఇతర తల్లులతో లేదా పెద్దవారితో మాట్లాడండి. మీకు అయినా రోజు రోజుకి మీ మానసిక స్థితి పెరుగుతూ ఉండడం వంటివి గమనిస్తే మీ యొక్క జనరల్ ఫిజిషియన్ Doctor) ని కలసి వారితో మాట్లాడండి.

 

ప్రతి చిన్న విషయానికి ఇది నేను ఏడుస్తున్నాను !

“నేను నీలాగా చిన్న చిన్న వాటికి ఏడ్చేదాన్ని. షాప్ కి వెళ్ళినపుడు పిల్లల బట్టలు, వస్తువులు చూసినపుడు ఏడవడం చేసేదాన్ని. ఈ సమయంలో మానసిక స్థితి బాగోలేకపోవటం, భావోద్వేగాలకు గురి కావడం సహజం. అది గర్భసమయంలో ఏర్పడే హార్మోన్ల యొక్క కారణం!”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి