21వ వారం

మీ శరీరం

changes in the body
ఏమి ఆశించాలి
మీరు చూడడానికి ఇప్పుడు అచ్చంగా గర్భిణీగా కనిపిస్తున్నారు. మీ పొట్ట పెద్దదిగా పెరగటం వల్ల మీ పాదాల మీద నిలబడటం కష్టంగా ఉంటుంది. మీ పొట్ట మీద, పిరుదుల మీద మరియు రొమ్ములు మీద సాగిన మచ్చలు కనిపిస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. తల్లి కాబోతున్న ప్రతి ఒక్కరు బాధ్యతల విషయంలో అధికమైన శ్రద్దగా వుంటారు. మీకు ఇప్పుడు విపరీతమైన ఆకలి మొదలవుతుంది.

బిడ్డ పరిమాణం

Week 21 size guide
ఏమి ఆశించాలి
మీ బిడ్డ ఇప్పుడు పెద్ద అరటికాయ అంత పరిమాణంలో ఉంటుంది (సుమారుగా 25cm పొడవు మరియు 350 గ్రాముల బరువు)

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించాలి
మీ బిడ్డ ఇప్పుడు బాగా తిరుగుతూ ఉంటుంది. బిడ్డ ఎక్కువగా నిద్ర పోవడం మొదలవుతుంది. బిడ్డ యొక్క చేతులు కాళ్లు సరి సమానంగా ఉన్నాయి. బిడ్డ కదలికలు సమన్వయంతో ఉన్నాయి. బిడ్డ మీరు తినే ఆహారం యొక్క రుచి చూడగలదు అనగా తీపి కారం వంటివి!

స్వీయ రక్షణ

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 21వ వారం
చిట్కాలు / సూచనలు
 • పెల్విక్ (కటి ఎముక) సంబంధిత వ్యాయామాలు చేయండి. ఈ వ్యాయామాలు చేయటం వలన మీరు మీరు దగ్గినా నవ్వినా, ఏడ్చినా మీకు తెలియకుండా యోని నుండి వచ్చే స్రావాలు రాకుండా ఉంటాయి.
 • మీ భావనలు, భావోద్వేగాలు గురించి కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో మాట్లాడండి. ఆతృతగా ఉండటం ఈ సమయంలో సహజం !
 • మీకు ఉన్న భయాందోళనలు గురించి మాతృత్వం గురించి మీ భర్త తో మాట్లాడండి.
 • మధ్య మధ్యలో ఆరోగ్యకరమైన చిరుతిండి తినండి.
 • బాగా నీళ్లు తాగండి. మరియు పీచు పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడదు. మరియు విరేచనం సాఫీగా అవుతుంది
 • నడుంనొప్పి కనుక ఉన్నట్లయితే నడుముకి మర్దన చేయించుకోండి.

మీ వైద్యుడిని అడగండి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. నా పాదాలు ఇపుడు ఎందుకు ఉబ్బుతున్నాయి ?
 2. సున్నితమైన యోగాసనాలు ఇప్పుడు చేయవచ్చా?
 3. నేను ఎంత వరకు బరువు పెరగాలి? లేదా ఎంత బరువు ఉండాలి?
 4. అవాంఛిత రోమాలు తీపించుకోవటం మరియు అందానికి సంబంధించిన చికిత్సలు చేయించుకోవచ్చా?
 5. నేను ఇంకా ఐరన్ మాత్రలు వేసుకుంటూనే ఉండాలా?

ముఖ్యమైన చర్యలు

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 21వ వారం
పాయింట్లు
 1. నా ఆలోచనలు గురించి నా భర్త తో మాట్లాడాలి.
 2. రోజూ 30 నిమిషాల సేపు నడవాలి.
 3. కుషల్ వర్క్ షాప్ నందు చేరాలి.
 4. కుషల్ యాప్ లో నా బరువు మరియు రక్తపోటు రికార్డు చేయాలి.
 5. 21వ వారం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి.

మీకు ప్రశ్నలు ఉండవచ్చు

" 2 గర్భిణీ స్త్రీలలో 1 రు మామూలుగానే ఒత్తిడికి లోనవుతారు. ఈ దశలో ఇది ఇంకా సహజం.
నేను నా ప్రాణ స్నేహితులతో మాట్లాడాను. దీని గురించి ఎవరికైతే అనుభవం ఉందో - వారితో మాట్లాడటం నాకు చాల ఉపయోగపడింది."

 

 

"నాకు అలాగే అనిపించింది. అలా ఎందుకంటే మన శిశువు లోపల చాలా వేగంగా పెరుగుతుంది దాని వల్ల మెడ కండరాలు మన శరీరాన్ని అదుపులో ఉంచుతాయి. నాకు నచ్చిన కొన్ని పనులు చేయలేక పోయేదాన్ని. కొన్ని సార్లు పొట్ట మీద పడుకోలేక పోయేదాన్ని".

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి