29వ వారం

నీ శరీరం

changes in the body
ఏమి ఆశించను
 • ప్రసవం జరిగే తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మీకు మీకు భయం గాను లేదా సంతోషం గానూ ఉంటుంది.
 • ఇంకా బాగా ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది. నిద్ర పట్టదు. అది ఒక సమస్యగా మారుతుంది. కాళ్లు నొప్పులు, మాటిమాటికీ బాత్రూం కి వెళ్ళవలసి వస్తుంది. మీకు నిలకడగా నించోడం, నడవటం కష్టమౌతుంది. పక్కకి తూలి పోవడం వంటివి జరగవచ్చు.
 • మీకు మూత్రాశయం, మూత్రనాళం ఇన్ఫెక్షన్ రావచ్చు.
 • మీ రొమ్ముల నుంచి ద్రవం కారుతూ ఉంటుంద.

మీ శిశువు పరిమాణం

Size week 29
ఏమి ఆశించను
మీ శిశువు ఇప్పుడు కాలిఫ్లవర్ అంత పరిమాణంలో ఉంటుంది (సుమారుగా 37సెం. మి పొడవు మరియు 1100 గ్రాముల బరువు ఉంటుంది ).

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించను
 • మీ బిడ్డ పర్ఫెక్ట్ గా తయారయింది.
 • రోజురోజుకి లావు అవుతూ తన అవయవాలు బాగా తయారయ్యాయి.
 • శిశువు చాలా చురుగ్గా ఉండటంతో పాటు అనేక రకాలుగా కదులుతుంది.
 • ఎముకలు కండరాలు బలంగా తయారవుతున్నాయి.
 • నిద్రపోతున్నప్పుడు నవ్వడం వంటివి ప్రారంభమవుతాయి.

మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి

Mission pageTaking care 2Our services page
సూచనలు
 • ప్రసవం మరియు బిడ్డ జన్మించడం అంటే ఏమిటి ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి
 • హాస్పిటల్ లో చేరవలసి వస్తే ఏమి తీసుకెళ్లాలి అందుకు ఏమేమి సిద్ధం చేసుకోవాలి అనేది తెలుసుకుని ఉండాలి
 • గర్భసమయంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుని ఉండాలి
 • మీ యొక్క భావోద్వేగాల గురించి మాట్లాడుతూనే ఉండండి. ఎవరికైనా చెప్పుకుంటేనే ఉండండి - ఈ సమయంలో మీరు ఎక్కువగా మీకు బాగా ఇష్టం అయినా వారిని లేదా మీరు కోల్పోయిన వారిని ఎక్కువగా గుర్తు తెచ్చుకుని బాధ పడతారు.
 • అస్తమానం నించోవటం లేదా కూర్చోవటం చేయవద్దు. కాలి పిక్కల్లో నరాల వాపు వచ్చి వెరికోస్ వెయిన్స్ వస్తాయి.
 • బాగా పీచు పదార్ధాలు ఉన్న వాటిని తింటూ ఉండండి. దీనివలన విరోచనం సాఫీగా అవుతుంది"

మీ డాక్టర్ని అడగవలసినవి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. నాకు చాల సేపు బాధగా , ఏదోలా ఉంటుంది . దీనికి ఏమి చేయాలి?
 2. నా బిడ్డ కదలికలు బాగానే ఉన్నాయా?
 3. డెలివరీకి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో నేను ఎలాంటి వైద్యాన్న ఆశించాలి? గర్భంతో ఉన్నప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి ఏమైనా ఇంజక్షన్లు ఉన్నాయా?
 4. నాకు నడుములో కింది భాగంలో బాగా నొప్పి మరియు రంగు, గాఢత విపరీతమైన వాసనతో కూడిన మూత్రం వస్తున్నాయి. మంటగా కూడా అనిపిస్తుంది. దీనివలన నేను మంచిగా ఉండలేకపోతున్నా. దయచేసి సహాయం చేయండి.

మీరు చేయవలసిన జాబితా

Todoicon
యాక్షన్ పాయింట్లు
 1. గర్భధారణలో ఏమైనా ఇన్ఫెక్షన్లు సోకకుండా ఇంజెక్షన్లు చేయించుకోవాలా
 2. కుషల్ వారి వర్క్ షాప్ లో సమయం బుక్ చేసుకోవాలి
 3. గర్భసమయంలో చేయించుకోవాల్సిన చెకప్ కోసం డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి.
 4. నా భర్తతో కూర్చుని ప్రసవ సమయంలో / జన్మనిచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? ఏమేమి సిద్ధం చేసుకోవాలి అనేది మాట్లాడుకోవాలి.
 5. మా అమ్మకి, స్నేహితురాళ్ళకి ఫోన్ చేసి నా అనుభవాలు గురించి మరియు భావోద్వేగాల గురించి చెప్పుకోవాలి."

బహుశా మీకు కలిగే ఇతర ప్రశ్నలు

"నేను ఎమోషనల్ రోలరు కోస్టర్ లాగా ఉన్నాను. అప్పుడప్పుడు సంతోషంతో ఉంటాను. ఇంకోసారి భయంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు రెండు రకాలుగా. పోయిన ఏడాది చచ్చిపోయినా మా నాన్న గురించి తలుచుకుంటూ బాధపడ్డాను. ముఖ్యంగా ఇంకా నా బిడ్డని చూడలేరు అన్న విషయం తలుచుకుని మరి బాధపడేదాన్ని. నన్ను బాగా మాట్లాడుతూ ఉండమని సలహా ఇచ్చారు. అందుకని నువ్వు కూడా స్నేహితులతో, కుటుంబంతో డాక్టర్తో ఇంకా నువ్వు దేని గురించి అయినా బాధగా/ భయంగా ఉన్నట్లయితే దాని గురించి మాట్లాడు. అలా చేయడం వల్ల నాకు బాగా సహాయ పడింది."

 

"గర్భంతో ఉన్నప్పుడు ఆటలమ్మ అనేది తల్లికి బిడ్డకు ఇద్దరికీ ప్రమాదమే. నువ్వు మీ డాక్టర్ తో మాట్లాడుకో. ఒకవేళ ఇదివరలో నీకు ఎప్పుడైనా ఆటలమ్మ రాకపోతే CMV cytomegalovirus హెర్పిస్ వైరస్ లాంటిది. అది సామాన్యంగా చిన్న పిల్లల్లో ఉంటుంది. అది మీ బిడ్డకు హానికరమైనది. మీ చేతులు సబ్బు, నీళ్లతో ఎప్పుడూ శుభ్రంగా కడుక్కోండి. మీరు తినే పదార్థాలను CMV ఉన్న పిల్లలతో పంచుకోకుండా దూరంగా ఉండి జాగ్రత్తపడండి. ఇలా చేయడం వలన మీకు ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవచ్చు. ఇంకా వేరు వేరు ఇన్ఫెక్షన్లు ఉన్నాయి వాటి గురించి డాక్టర్తో మాట్లాడి తెలుసుకోండి."

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి