33వ వారం

నీ శరీరం

changes in the body
ఏమి ఆశించను
మీరు లావుగా అవుతున్నారు. మీరు ఇంకా అలసిపోతారు. మీరు రెండు కేజీలు అదనంగా మోస్తున్నారు. మీ బిడ్డ కదలికలను చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. బిడ్డ  కదలడం,తన్నడం అవి మీకు స్ప్రుష్టంగా తెలుస్తాయి. మీరు చాలా తక్కువగా నిద్ర పోతారు. పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ ఇప్పటి నుండే గాబరా పడుతూ ఉంటారు.  బిడ్డ పుట్టే లోపు ఏం చేయాలి అనే ఆలోచనలో ఉంటారు.

మీ శిశువు పరిమాణం

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 33వ వారం
ఏమి ఆశించను
మీ బిడ్డ చిన్న గుమ్మడి కాయంత పరిమాణంలో ఉంటుంది (సుమారుగా 42 సెం. మి పొడవు మరియు 1750 గ్రాముల బరువు ఉంటుంది).

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించను
బిడ్డ యొక్క మెదడు ఇంకా నరాల వ్యవస్థ పూర్తిగా తయారవుతుంది. పుర్రె ఎముక తప్ప మిగతా ఎముకలు అన్ని గట్టిగా తయారవుతాయి. బిడ్డ బరువు బాగా త్వరగా పెరుగుతుంది. వారానికి 250  గ్రాముల చొప్పున పెరగవచ్చు. బిడ్డ రాత్రికి, పగటికి తేడాలు కనుక్కో గలదు. బిడ్డకు రోగనిరోధక శక్తి ఏర్పడి ఇన్ఫెక్షన్లు తట్టుకునే లాగా ఎదుర్కొనే శక్తిని పొందుతుంది.

స్వీయ రక్షణ

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 33వ వారం
సూచనలు
 • మీరు ఉన్న చోట చుట్టూ ఎక్కువ ఖాళీ ఉండేటట్లు చూసుకోండి. -  ఉదాహరణకి కూర్చునేటప్పుడు టేబుల్ దగ్గర,  ఆటోలో, కార్లో ఎందుకంటే మీరు రోజు రోజుకి లావుగా తయారవుతున్నారు.
 • ప్రసవానికి తయారవ్వండి. ప్రసవానికి కావలసినవి పెట్టుకుని బ్యాగ్  రెడీ చేసుకోవాలి.
 • ముఖ్యమైన నెంబర్లు అన్ని మీ ఫోన్లో ఫీడ్ చేసుకోండి. డాక్టర్ నెంబర్, హాస్పిటల్ అడ్రస్, ఫోన్ నెంబర్ మరియు తెలిసిన వాళ్ళవి రాసి పెట్టుకోవాలి.
 • పడుకోబోయే ముందు వ్యాయామం చేయడం తినడం, తాగడం వంటివి చేయొద్దు. పడుకోబోయే ముందు కప్పు వేడి పాలు తాగండి.
 • రోజులో కనీసం రెండు సార్లు బిడ్డ కదలికలు గమనించాలి.
 • కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పెరుగు బాగా తీసుకోండి.

మీ డాక్టర్ని అడగవలసినవి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. నా బిడ్డ ఏ పొజిషన్లో  ఉంది? లోపల బాగానే ఉందా?
 2. ప్రసవ సమయంలో వచ్చే నొప్పులకు తట్టుకోవడం ఎలా?
 3. రోజుకు రెండు కప్స్ టీ తాగుతాను. పర్వాలేదా?
 4. వేరే గర్భిణీస్త్రీ లకు వచ్చినట్లు సంకోచాలు, నొప్పులు నాకు రావట్లేదు.  అది సహజమేనా?

మీరు చేయవలసిన జాబితా

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 33వ వారం
యాక్షన్ పాయింట్లు
 1. ప్రయాణానికి కావలసినవి అన్నీ హాస్పిటల్కి వెళ్లబోయే ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
 2. కుషల్ వర్కుషాపు లో సమయం బుక్ చేసుకోవాలి.
 3. డాక్టర్ దగ్గర చెకప్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలి.
 4. నేను, నా భర్త కలిసి ప్రసవానికి కావలసిన అన్ని సిద్ధం చేసుకోవాలి.
 5. మా అమ్మగారికి లేదా స్నేహితులకి ఫోన్ చేసి నాకు ఈ సమయంలో ఎలా ఉంది, ఏమి అనిపిస్తుంది అనేది పంచుకోవాలి.

బహుశా మీకు కలిగే ఇతర ప్రశ్నలు

హాస్పిటల్కి తీసుకు వెళ్లవలిసిన బ్యాగ్ను ఎలా సిద్ధం చేసుకోవాలి? అందులో ఏమేమి ఉంచాలి?

" నేను కొన్ని వస్తువులు పెట్టుకున్నాను చేతికి అందుబాటులో ఉండవలిసినవి -

 • మా డాక్టర్ మెడికల్ రికార్డ్స్,మందులు, స్కాన్ రిపోర్ట్ వంటివి
 • పుట్టే బిడ్డ కోసం బట్టలు, నాపీస్
 • ప్రసవ సమయంలో వదులుగా గాలి ఆడేటట్లు వుండే బట్టలు
 • లోదుస్తులు, విడిగా వేరే బట్టలు, పాడ్స్/ క్లాతులు
 • రాత్రివేళ వేసుకునే బట్టలు
 • తువ్వాలు ,మరియు టాయిలెట్ సామాను
 • ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు,
 • నా మందులు లాంటివి."
ఎటువంటి గుర్తులు మరియు లక్షణాలకు నేను జాగ్రత్త వహించాలి? ఇంకా దేనికి భయపడాల్సిన వస్తుంది?

"ఈ పరిస్థితిలలో మీ డాక్టర్ ని వెంటనే కలవాలి  -

 • ఒకవేళ నొప్పి ,వాపు ఎరుపుదనం, కాలి పిక్క భాగంలో వస్తే.
 • ఛాతి భాగంలో నొప్పిగా ఉండి ఊపిరి తీసుకోలేక పోతుంటే.
 • ఉన్నట్లుండి యోని నుంచి చాల ఎక్కువగా రక్తస్రావం జరగడం, కళ్ళు తిరగడం ఇంకా గుండె దడగా అనిపించడం.
 • జ్వరం, కడుపులో నొప్పి, తలనొప్పి.
 • చూపులో మార్పులు రావడం మరియు వాంతులు అవ్వడం ఇలాంటి లక్షణాలు ఉన్న వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి."

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి