నీ శరీరం

ఏమి ఆశించను
ఒక్క రాత్రిలో గర్భానికి సంబంధించిన లక్షణాలు చిహ్నాలు మాయమైపోతే మీరు ఆశ్చర్య పడవద్దు. అది సహజంగా జరగవచ్చు. మీరు ఊపిరి తీసుకునేటపుడు కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రసవానికి వీలుగా బిడ్డ కింది వైపు జరుగుతూ ఉంటుంది. గుండెల్లో మంట కడుపులో ఎసిడిటీ వంటి లక్షణాలు మాయమైపోతాయి. ఏ నిమిషం అయినా మీరు బిడ్డని కనేస్తారేమో అని అనిపిస్తుంది. కానీ దానికి ఇంకా కొన్ని వారాలు పట్టవచ్చు. నడక ఇంకా కష్టంగా మారుతుంది. బాత్ రూమ్ కి చాలా సార్లు వెళ్ళవలసి వస్తుంది.
మీ శిశువు

ఏమి ఆశించను
బిడ్డ ఇక బయటకి రావడానికి వీలుగా ఉండే పొజిషన్ లోకి రావడానికి ప్రయత్నిస్తుంది. బిడ్డ యొక్క తల పెల్విక్ ఎముకలోనికి ( కటి ఎముక) వస్తుంది. బిడ్డ లోపల అంత కదులుతూ ఉంటుంది. పొట్ట యొక్క ఆకారం కూడా మారవచ్చు. పుట్టబోయేది మగ బిడ్డ అయితే బిడ్డ యొక్క వృషణాలు సంచులుగా ఏర్పడతాయి. మీరు ఇపుడు స్పృష్టంగా పొట్ట మీద నుండి బిడ్డ యొక్క అవయవాలను అనగా కాలు, చేయి అని గుర్తించగలరు! బిడ్డ పుట్టే సమయానికి ఉండవలిసిన అంత పొడవుగా ఉంది.
మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి

సూచనలు
- ఆరోగ్యకరమైన ఆహరం తినండి. అదేవిధంగా తేలికపాటి వ్యాయామం చేయండి . మీరు విశ్రాంతి తీసుకుంటూ మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.
- గర్భిణిగా ఉన్నపుడు చేయించుకోవాల్సిన వైద్య పరీక్షల నిమిత్తం డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి.
- మీకు కళ్ళు మసకబారడం, పొడి బారడం, చూపు కాస్త మందగించడం వంటివి జరిగిన కంగారు పడవద్దు. వీటి గురించి తెలుసుకుని ఉండాలి. ఈ లక్షణాలు ప్రసవానంతరం తగ్గిపోతాయి.
- యోని భాగం శుభ్రంగా ఉంచుకోవాలి. పొడిగా ఉంచాలి. ఎందుకంటే మీకు తెల్లబట్ట అవ్వటం ఎక్కువ అవుతుంది. ఇది పెద్ద సమస్య కాదు. శుభ్రంగా పొడిగా ఉంచుకుంటే ఎలాంటి బాక్టీరియా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.
- ఎక్కువగా నడుస్తూ ఉండండి. బాగా నిద్ర పోవడానికి, విశ్రాంతి పొందడానికి నడక ఉపయోగపడుతుంది.
- మీరు నిద్రపోవడానికి 1 , 2 గంటల ముందు నుండి నీరు తాగకుండా ఉండడానికి చుడండి. దీనివలన మీరు ఎక్కువ సార్లు బాత్రూం కి వెళ్లవలిసిన అవసరం రాదు.
మీ డాక్టర్ని అడగవలసినవి

ప్రశ్నలు
- నా యోని భాగం నుంచి తడిబట్ట ఏర్పడుతుంది. అది చిక్కగా మరియు పసుపు పచ్చ రంగులో ఉండి వాసన కూడా వస్తుంది. దానిని ఎలా ఆపాలి.
- నేను రక్త పరీక్ష ఏమైనా చేయించుకోవాలా (గ్రూప్ B స్ట్రేప్కో కోకస్) మూడవ త్రైమాసిక దశలో స్కాన్ చేయించుకోవాలా?
- నాకు విపరీతమైన నడుము నొప్పి వస్తుంది. ఇది బిడ్డ యొక్క పొజిషన్ మారడం వలన వస్తుందా?
మీరు చేయవలసిన జాబితా
బహుశా మీకు కలిగే ఇతర ప్రశ్నలు
ప్రసవ సమయంలో కలిగే నొప్పిని తగ్గించుకోవడానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా?
"మీరు ముందుగానే ప్రసవం జరిగే విధానాన్ని తెలుసుకుని ఉండటం మంచిది. ప్రసవం జరిగే సమయంలో ఆద్ద్దురా, కంగారు పడకుండా కాస్త ప్రశాంతంగా ఉండాలి. విశ్రాంతి తీసుకుంటూ ఊపిరి పీల్చుకుంటూ ఉండాలి. యోగాలో బ్రీతింగ్ ( ఊపిరి తీసుకునే వ్యాయామం) ఆ విధానం మీకు ఉపయోగపడుతుంది. కాస్త వంగటం, నడవడం , ఒక పక్కనుండి ఇంకో వైపుకి దొర్లడం వంటివి చేయాలి. "
నా స్నేహితురాలు నేను తీసుకునే ఆహరంతో పాటు కొబ్బరి నీళ్లను కూడా త్రాగమని చెప్పింది. అలా చేయడం వలన పుట్టబోయే బిడ్డ రంగుగా (తెల్లగా) పుడతారని అంది. నిజమేనా?
"బిడ్డ రంగుగా పుట్టడం లేదా రంగు తక్కువగా పుట్టడం అనేది తల్లి తీసుకునే ఆహారాన్ని బట్టి ఉండదు. బిడ్డ యొక్క రంగు అనేది తల్లితండ్రుల యొక్క జీన్స్ ( జన్యువులు) బట్టి ఉంటుంది. మంచి పోషకాహారం తినడం వలన తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఇక కొబ్బరినీళ్లు తాగడం వలన శరీరం తేమగా ఉండడానికి తోడ్పడుతుంది."