నీ శరీరం

changes in the body
ఏమి ఆశించను
మీకు ఇపుడు నెలలు నిండి ప్రసవానికి దగ్గరగా ఉన్నారు.  అయినా కానీ 37 వారాల కంటే ముందే ప్రసవం జరిగితే ఆ బిడ్డకి హాస్పిటల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ముర్రుపాలు (అనగా మొదటిసారి వచ్చే పసుపు రంగు పాలు ) రావడం మొదలవుతుంది. ఇది మీ బిడ్డకు పట్టటం చాలాఅవసరం. ఇది ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. మీకు పక్కటెముకలు బాగా నొప్పి పుడుతుంటాయి. మీకు ఎక్కువసార్లు బాత్రూంకి వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లు మీకు ఆపుకోలేనంత వేగంగా వస్తుంది. విపరీతమైన తలనొప్పి వస్తూఉంటుంది.

మీ శిశువు పరిమాణం

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 35వ వారం
ఏమి ఆశించను
మీ బిడ్డ కర్బూజ అంత పరిమాణంలో ఉంటుంది (సుమారుగా 45 సెం. మి పొడవు మరియు 2 .2 కేజీల బరువు ఉంటుంది).

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించను
బిడ్డ మోకాళ్ళు ఛాతి వరకు ముడిచి పెట్టుకుంటుంది. లోపల తక్కువ చోటు ఉంటుంది అయినా బిడ్డ కదులుతుంది. అవి మీకుతెలుస్తాయి. మీరు గమనించవచ్చు. బిడ్డ యొక్క చేతులు, కాళ్ళు ఇప్పుడు బొద్దుగా మారాయి. బిడ్డ బరువు పెరగడం మొదలు పెట్టింది. ప్రసవం జరిగే వరకు బిడ్డ బరువు పెరుగుతూనే ఉంటుంది. బిడ్డ యొక్క మెదడు వేగంగా ఎదుగుతుంది.

మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 35వ వారం
సూచనలు
 • మీరు ఇప్పుడు చాలా నెమ్మదిగా ఉండాలి - వత్తిడిని తగ్గించుకోవాలి.
 • మీ బిడ్డ యొక్క కదలికలో ఏమైనా మార్పులు గమనిస్తే మీ డాక్టర్ ని సంప్రదించండి.
 • మీకు ప్రసవం జరిగేటప్పుడు పక్కన ఎవరు ఉండాలి అనే విషయాన్నీ మీ భర్త తో పంచుకోండి. మీకు నచ్చిన వారు మీ పక్కన ఉంటె మీరుచాల ధైర్యంగా ఉంటారు.
 • మీకు ఏమైనా డిప్రెషన్ , ఆత్రుత వంటివి కలుగుతుంటే మీ డాక్టర్ని సంప్రదించండి.
 • కుదిరినంత వరకు మీరు బాత్రూంకి వెళ్లిన ప్రతిసారి మూత్రం అంతా పోయడానికి ప్రయత్నించండి.
 • పెల్విక్ (కటి ఎముక) వ్యాయామాలు చేయండి.
 • మీకు వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి మీ గది నుండి కాసేపు బయటకి వచ్చి చల్లని గాలిని ఆస్వాదించండి.

మీ డాక్టర్ని అడగవలసినవి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. కోరింత దగ్గు కి సంబంధించిన ఇంజక్షన్ నేను చేయించుకోవాలా?
 2. కుటుంబ నియంత్రణ గురించి ఏమి చేయాలి?
 3. నేను డెలివరీకి ఎలా తయారవ్వాలి?
 4. నేను ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి?
 5. ఇప్పుడు నా బిడ్డ యొక్క స్థానం (పొజిషన్ ) ఎలా ఉంది

మీరు చేయవలసిన జాబితా

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 35వ వారం
యాక్షన్ పాయింట్లు
 1. తల్లిపాలను పట్టేటప్పుడు మొదటి కొన్ని రోజులలో ఏం చేయాలి?
 2. ముఖం మీద వాపు గమనించుకోవాలి.
 3. బరువు ఎంత ఉన్నారు చూసుకుంటూ జాగ్రత్తపడాలి.
 4. కుషాల్ వారి వర్కుషాప్ సమయాలను తెలుసుకుంటూ ఉండాలి.
 5. ఫోలిక్ యాసిడ్ మాత్రలు మరియు గర్భ సమయంలో వాడవలిసిన విటమిన్ మాత్రలను వాడుకోవాలి.
 6. డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి.

బహుశా మీకు కలిగే ఇతర ప్రశ్నలు

"బర్త్ ప్లాన్ అనగా మీరు ఏ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలి అనుకుంటున్నారు? అపుడు మీ పక్కన ఎవరు ఉండాలి అనుకుంటున్నారు, మరియు మీరు ఎలాంటి సదుపాయాలు కోరుకుంటున్నారు. నొప్పులు తక్కువ ఉండటానికి డాక్టర్ని అడగడం, ఎలాంటి పొజిషన్లో బిడ్డనికనాలి అనుకుంటున్నారు ఇలాంటివన్నీ ప్రణాళికలు వేసుకోవడమే బర్త్ ప్లాన్. అన్ని దేశాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హాస్పిటల్ కాన్పులనేప్రోత్సహిస్తుంది!"

"గర్భం దాల్చినప్పుడు చాలా రకాల అనుభూతులను చూస్తారు. మీకోసం మీ బిడ్డ కోసం కొన్ని సందర్భాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిఉంటుంది. మీ భర్త మీతో పాటు మీ పక్కనే ఉంటూ కొన్ని కొన్ని విషయాలలో సర్దుకుపోతూ మీకు సహాయ పడుతూ ఉండాలి. వారికి పొగపీల్చే అలవాటు, మద్యం సేవించడం ఉంటే పూర్తిగా.”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి