36వ వారం

నీ శరీరం

changes in the body
ఏమి ఆశించను
మీకు ఇపుడు పొట్ట బిగుసుకుపోవడం , బ్రాక్స్టన్ సంకోచాలు మీకు వస్తూనే ఉంటాయి. మీరు ఇపుడు తొందరగా అన్ని సిద్ధం చేసుకొవాలి, బిడ్డ రావడానికి ఇదే సమయం అని ఇంటిని శుభ్రం చేసుకోవాలి అని ఆలోచనతోఉంటారు. కానీ ఎక్కువగా అన్ని పనులు చేయకండి! మీరు డాక్టర్ వద్దకు చెకప్ నిమిత్తం వెళ్ళినపుడు వారు మీకు రక్తపోటు, మరియు మూత్ర పరీక్షలు, పొట్ట యొక్క ఆకారం/ సైజు వంటివిపరీక్షలు చేస్తారు. మీకు ఈ సమయాల్లో హాస్పిటల్ కి చెకప్ నిమిత్తం వెళ్లడం చాల శ్రమతో కూడుకున్నది కాబట్టి మీరు వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ మీరుతప్పనిసరిగ చెకప్ కి వెళ్ళాలి! మీరు ఇక చాల ఆతృతగా, కంగారుగా ఉంటారు ప్రసవం రోజు ఏమి జరుగుతుందా అని. ఈ విషయాలను డాక్టర్ను అడగండి!

మీ శిశువు పరిమాణం

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 36వ వారం
ఏమి ఆశించను
మీ బిడ్డ ఇపుడు లెట్యూస్ అంత పరిమాణంలో ఉంటుంది (సుమారుగా 46 సెం. మి పొడవు మరియు 2.500 కేజీల బరువుఉంటుంది).

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించను
బిడ్డ యొక్క జీర్ణ వ్యవస్థ మొత్తం తయారైంది. బిడ్డ ఇపుడు తల్లి నుండి పాలు త్రాగి వాటిని జీర్ణించుకోగలదు. బిడ్డ యొక్కఊపిరితిత్తులుకూడా పూర్తిగా తయారయ్యాయి. ఇవి బిడ్డ పుట్టిన వెంటనే మొదటిసారి ఉపిరి తీసుకున్నపుడు పనిచేయడం ప్రారంభిస్తాయి. మీ బిడ్డ ఇపుడు చూడడానికి ముద్దుగా ఉండే పాదాలతో , బొద్దుగా ఉండే కాళ్ళతో ఉంటారు. బిడ్డ యొక్క చెవులు చాలా సున్నితంగా ఉంటాయి. మీ యొక్క గొంతును గుర్తించగలదు. బిడ్డ ఇక పెరగడం అనేది ఇపుడు కాస్త తగ్గుతుంది.

మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 36వ వారం
సూచనలు
 • ప్రసవం యొక్క లక్షణాలను గుర్తించండి. నొప్పులు లేదా కదలికలు చాల ఎక్కువగా వస్తాయి మరియు చాల బలంగా తరుచుగా వస్తూనేఉంటాయి.
 • ఇవి నిజమైన ప్రసవ నొప్పుల యొక్క గుర్తులు. ఇంటిపనులు చేసేటపుడు తరచుగా విశ్రాంతి తీసుకోండి.
 • మీరు తప్పనిసరిగా డాక్టర్ గారి వద్దకు చెకప్ నిమిత్తం వెళ్ళాలి అని గుర్తుంచుకోండి. 
 • కొన్ని పెల్విక్ ఎముక (కటి ఎముక) వ్యాయామాలు చేయండి. దీనివలన మీకు నడుమునొప్పి తగ్గుతుంది. మరియు మీరు వేడినీటికాపరం వంటివి పెట్టినా నడుంనొప్పి తగ్గుతుంది. 
 • మీరు చేయగలిగినన్ని నాపీలను తయారుచేసుకోండి. 

మీ డాక్టర్ని అడగవలసినవి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. నెలలు నిండని ప్రసవం యొక్క గుర్తులు ఏమిటి?
 2. నా బిడ్డ ఉండవలిసిన స్థానం / స్థితి లోనే ఉందా?
 3. ప్రసవానంతరం నేను ఏమైనా విటమిన్ K ఇంజక్షన్ చేయించుకోవాలా?
 4. నాకు నొప్పులు వస్తే నేను ప్రసవిస్తున్నాను అని అర్థమా?
 5. ప్రసవ సమయంలో నొప్పులు తగ్గడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా?
 6. నేను బిడ్డకి పాలు ఇవ్వడానికి తప్పనిసరిగా ఏమైనా చేయవలిసిన పనులు ఉన్నాయా?

మీరు చేయవలసిన జాబితా

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 36వ వారం
యాక్షన్ పాయింట్లు
 1. డాక్టర్ వద్దకు చెకప్ నిమిత్తం వెళ్ళేటపుడు భర్తని కూడా తీసుకు వెళ్ళాలి.
 2. నేను ఐరన్ మరియు విటమిన్ మాత్రలు వాడుకోవాలి.
 3. కుషల్ వర్కుషాప్ లో పాల్గొనాలి.
 4. డాక్టర్ వద్దకు చెకప్ నిమిత్తం వెళ్ళేటపుడు భర్తని కూడా తీసుకు వెళ్ళాలి.
 5. డెలివరీ నిమిత్తం హాస్పిటల్కి తీసుకువెళ్లవలిసిన బ్యాగ్ సిద్ధంగా ఉందొ లేదో చూసుకోవాలి.
 6. డాక్టరు గారి నుండి బ్రెస్ట్ ఫీడింగ్ (చనుపాలు )ఇవ్వడం గురించి తెలుసుకోవాలి

బహుశా మీకు కలిగే ఇతర ప్రశ్నలు

"తల్లికి బిడ్డ పుట్టిన వెంటనే పాలు సహజంగానే వస్తాయి అనేది నిజం! మీరు తెలుసుకోవలసింది బిడ్డని ఏ పొజిషన్లో ఉంచి పాలుపట్టాలి అని ఇంకా మీరు ఇచ్చిన పాలు బిడ్డకి సరిపోయాయా , లేదా? మళ్ళి ఎంత సమయం తర్వాత పాలు పట్టాలి అనేవితెలుసుకోవాలి. ప్రసవానంతరం వెంటనే కొలొస్టరం అనగా చిక్కగా, పసుపు రంగులో ఉండే పాలు పట్టాలి. అందులో బిడ్డకి కావలిసినవిటమిన్స్, ప్రోటీన్స్, మరియు మినరల్స్ వంటివి బిడ్డకి హానికారక బాక్టీరియా నుండి ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతాయి. డాక్టర్స్ బిడ్డ పుట్టినగంటలోపే ఆ పాలు పట్టించాలి అని తెలుపుతారు. మీరు మరింత సమాచారం కోసం మీ డాక్టర్ని సంప్రదించవచ్చు." 

"యాంటీనేటల్ క్లాస్ అనగా ఎవరైతే సంతానాన్ని కోరుకుంటున్నారో వారు మరియు వారి భర్తలు ఆరోగ్యకరమైన బిడ్డను పొందడానికి , బిడ్డకు సంబందించిన విషయాలను గురించి, డెలివరీకి ఎలా సిద్ధం అవ్వాలి , తల్లికి తన ప్రసవం మరియు బిడ్డకి సంబందించినభయాలు గురించి పూర్తీ సమాచారం తెలుసుకోవడానికి ఈ తరగతులకు వెళ్లడం. వీటి వలన మంచి నిర్ణయాలు తీసుకోవడానికిఉపయోగపడుతుంది. మరియు మీలాగే సంతానాన్ని కోరుకుంటున్నారో వారిని కలవచ్చు మరియు వారితో స్నేహం కూడా చేయవచ్చు." 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి