39వ వారం
నీ శరీరం

ఏమి ఆశించను
మీరు చాల ఆతృతగా ఉంటారు - ఎపుడు డెలివరీ అవుతాను అని. ఎక్కువగా యోని నుండి స్రావాలు రావడం జరుగుతాయి. - ఒకవేళ మీరు చిన్నగా మ్యూకస్ ( జిగురు వంటిది ) గమనిస్తే అది షో. మీకు పొట్ట కింద భాగం చాల ఇబ్బందిగా ఒత్తిడి పెరిగినట్లుగా గమనిస్తారు. నడుము నొప్పి కూడా చాల ఎక్కువగా వస్తుంది. ఇంకో వైపు మీరు మీ శక్తీని కోల్పోతున్నట్లు భావిస్తారు.
మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి

సూచనలు
ప్రసవానికి సంబంధించిన గుర్తులు తెలుసుకోండి అందులో కొన్ని -
- నీటి సంచి పగిలి నీరు రావడం, అనగా ఉమ్మనీటి సంచి పగలడం, విరేచనాలు లేదా వాంతులు ఇవి ఎక్కువ మంది స్త్రీలు అనుభవిస్తారు
- ప్రసవం కాసేపట్లో జరుగుతుంది అనగా
- మీకు శక్తీ పెరుగుతుంది.
- షో - మ్యూకస్ కనిపిస్తుంది . అది అప్పటిదాకా గర్భాశయా ముఖ ద్వారాన్ని మూసి ఉంచుతుంది.
- రక్తం కనిపిస్తుంది ( యోని నుండి).
- భారత దేశంలో ప్రసవాన్ని డాక్టర్ ప్రారంభిస్తారు ( లేదా నిర్ణయిస్తారు). వేరే ఇతర దేశాలలో డాక్టర్స్ 40 వరాల తర్వాత ఈ పద్దతిని వాడతారు .
- బిడ్డ యొక్క కదలికలను గమనిస్తూనే ఉండాలి.
- నిజమైన నొప్పులకు, అబద్ధపు నొప్పులకు తేడా గమనించుకోవాలి.
- ఊపిరి పీల్చుకునే మరియు విశ్రాంతి తీసుకునే పద్దతులను ఉపయోగించాలి.
మీ డాక్టర్ని అడగవలసినవి

ప్రశ్నలు
- నాకు నొప్పులు లాగా తెలుస్తున్నాయి . అవి ప్రసవానికి సంబందించిన నొప్పులేనా?
- నేను హాస్పిటల్ లో ఎపుడు చేరాలి?
- ఏమైనా ఎమర్జెన్సీ అని తెలిపే గుర్తులు ఏమైనా ఉన్నాయా నేను గమనించుకోవడానికి?
- ప్రసవం చాల నొప్పిగా ఉంటుందా?
- ప్రసవ నొప్పులు తట్టుకోవడానికి ఏమైనా మందులు తీసుకోవచ్చా?
- ప్రసవ సమయంలో నేను ఏమైనా తినడం, త్రాగడం వంటివి చేయొచ్చా ?
- నేను హాస్పిటల్ నందు ఎన్ని రోజులు ఉండవలిసి వస్తుంది ?
- నాతోపాటు నా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండచ్చా హాస్పిటల్ నందు ?
- నేను బిడ్డకి సంబందించిన వస్తువులు ఏమి తెచ్చుకోవాలి?
బహుశా మీకు కలిగే ఇతర ప్రశ్నలు
బిడ్డ పుట్టాక ఏమి పరీక్షలు లేదా చెకప్ చేపించాలి?
"తల్లితండ్రులు బిడ్డ పుట్టిన 72 గంటలలోపు బిడ్డకు శారీరక పరీక్షలు జరగాలని కోరతారు. దాని యొక్క ఉద్దేశం బిడ్డకి ఏమైనాసమస్యలు ఉన్నాయేమో అని గుర్తించి, చికిత్స ఇవ్వడం కోసం. సాధారణంగా ఎటువంటి సమస్యలు ఉండవు. నా కొడుకుకి కళ్ళు, గుండె, తుంటిభాగం మరియు బిడ్డ వృషణాలు పరీక్షించారు."
ప్రసవం తర్వాత నేను ఏమి ఆశించవచ్చు ?
"నాకు సాధారణ కాన్పు జరిగింది. మరియు నాకు ఎటువంటి కుట్లు పడలేదు ఎందుకంటే ఎపిజియోటామి చేయలేదు. మొదట్లోనేను టాయిలెట్ కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాను. నీరు బాగా త్రాగాను. మొదట్లో గాయంలాగా చాల నొప్పి, మంటగాఉండేది. మొదటి కొన్ని రోజులు మలబద్దకం కూడా ఉంది. యోని నుండి రక్తస్రావం జరిగేది. మొదట్లో కాస్తంత ఎక్కువగా తర్వాతవారాలు గడిచే కొద్దీ తగ్గింది మరియు తగ్గేసమయంలో కాఫీ రంగులో (బ్రౌన్) బ్లీడింగ్ కనపడింది. నాకు నెలసరి సమయంలో వచ్చేనొప్పులు కొంచెం కనిపించేవి."