14వ వారం

మీ శరీరం

changes in the body
ఏమి ఆశించాలి
మీరు రెండవ త్రైమాసిక దశలో ఉన్నారు. మీకు ఇపుడు అలసట తగ్గి ఇది వరకు ఉన్నట్లు శక్తివంతంగా ఉంటారు. మీ చిన్ని కడుపు మీద ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటుంది. పొద్దున్నే మీకు వచ్చే వికారాలు మరియు లేదా వేవిళ్ళు చిన్నగా తగ్గిపోతాయి

బిడ్డ పరిమాణం

Week 14 size guide
బిడ్డ పరిమాణం
మీ శిశువు ఇప్పుడు నారింజపండు పరిమాణంలో ఉంటుంది (సుమారుగా 80-85 పొడవు).

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించాలి
మీ బిడ్డ ఇపుడు ఎక్కువగా కదులుతూ ఉంటుంది. మీ బిడ్డ ఇపుడు తిన్నగా నుంచుంటుంది. మీ బిడ్డ కి ఇపుడు వెంట్రుకులు రావడం ప్రారంభమవుతుంది. మీ బిడ్డ యొక్క కిడ్నీలు పని చేయడం ప్రారంభమవుతాయి మరియు బిడ్డ మూత్రం పోయడం కూడా జరుగుతుంది.

స్వీయ రక్షణ

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 14వ వారం
చిట్కాలు / సూచనలు
 • సున్నితమైన కటి ఎముక ( పెల్విక్ఎముక) సంబంధిత వ్యాయామాలు చేయాలి.
 • వ్యాయామాలు చేయడం వలన మీ శక్తీ కొంత ఖర్చు అవడం వలన గర్భధారణ సమయం లో వచ్చే షుగర్ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు.
 • క్రమం తప్పకుండా తినాలి. చిన్న మోతాదుల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి తినాలి. నెమ్మదిగా తినాలి. భోజనం నీటితో మొదలు పెట్టాలి.
 • వదులుగా ఉన్న బట్టలు వేసుకుని ఎప్పుడూ ఒంటిని చల్లగా ఉంచాలి.
 • తాజాగా ఉన్న తిండి తినాలి. అప్పుడే ఎక్కువ విటమిన్లు, మినరల్స్ శరీరానికి అందుతాయి.

మీ వైద్యుడిని అడగండి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. మందులు తీసుకోవటం ఎంత వరకు మంచిది నేను నొప్పి మాత్రలు తీసుకోవచ్చా?
 2. నాకు అనారోగ్యంగా ఉన్న ఒక అత్తయ్య ఉంది. ఆవిడని చూసుకున్నప్పుడు ఇంట్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి?
 3. నాకు బాగా అలసటగా అనిపిస్తుంది. రెండవ త్రైమాసిక దశలో ఇది సర్వసాధారణమా?
 4. నేను రక్తం మరకలు గమనించాను అది సహజమా?
 5. నేను ప్రత్యేకమైన గర్భ సంబంధిత విటమిన్లు తీసుకొనవలసిన అవసరం ఉందా?

ముఖ్యమైన చర్యలు

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 14వ వారం
పాయింట్లు
 1. పని ప్రదేశంలో గర్భిణీ యొక్క హక్కులు తెలుసుకోవాలి.
 2. గర్భిణీ స్త్రీల కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు ఏమున్నాయో తెలుసుకోవాలి.
 3. రక్తపోటుని చూసుకోవాలి.
 4. బరువుని చూసుకోవాలి.
 5. దగ్గరలో ఉన్న కుషల్ వారి తరగతి కార్యక్రమాలకు రిజిస్టర్ కావాలి.

మీకు ప్రశ్నలు ఉండవచ్చు

"ఇది పూర్తిగా మీ ఇష్టం. నేను చాలా సన్నిహితమైన వ్యక్తితో చెప్పాను, నేను ఆమెను విశ్వసించగలను మరియు సుఖంగా ఉండగలను. ఆమెకు అనుభవం ఉంది మరియు ఆమె సలహాను నేను విలువైనదిగా భావిస్తున్నాను."

 

“నేను విశ్రాంతి తీసుకోవడానికి ప్రతి రోజు కొంత సమయం కేటాయించాను. నేను రేడియో విన్నాను లేదా టీవీ చూశాను. నేను సంగీతం విన్నాను. నేను పత్రికలు చదివాను."

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి