15వ వారం

మీ శరీరం

changes in the body
ఏమి ఆశించాలి
బిడ్డ త్వరగా పెరుగుతుంది, కాబట్టి మీ నడుము చుట్టూ గట్టి గా ఉన్నట్లు అనిపిస్తుంది. మీకు బాగా యోని నుండి స్రావం అవ్వటం లేదా అయ్యే అవకాశం ఉంది. ఇది మీ యోనినీ శుభ్రంగా మరియు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది మామూలుగా స్రావాలు సరిగ్గా తెల్లగా లేదా రంగు, గుణం లేకుండా ఉంటుంది మీరు నోటిలో ఎర్రగా ఉబ్బి రక్తస్రావం అవుతున్న చిగుళ్లు గమనిస్తారు. పళ్ళు తోముకునే సమయంలోనూ రక్తం వస్తూ ఉంటుంది. దీనికి కారణం గర్భం యొక్క హార్మోన్లు.

బిడ్డ పరిమాణం

Week 15 size guide
ఏమి ఆశించాలి
మీ శిశువు పరిమాణం ఒక జామకాయ అంత ఉంటుంది

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించాలి
మీ బిడ్డ యొక్క కనుబొమ్మలు మరియు కనురెప్పలు కూడా కనిపించడం ప్రారంభమవుతాయి. అతడు లేదా ఆమె కళ్ళు చాలా గట్టిగా మూసుకుపోయి ఉంటాయి. అవి సున్నితంగా ఉండటం వలన కాంతిని చూడలేవు. మీ బిడ్డ ఇప్పుడువినడం ప్రారంభించింది . మీ బిడ్డ తో మాట్లాడడానికి ప్రయత్నించండి. బిడ్డ తప్పకుండా వింటుంది మీ మాటలని.

స్వీయ రక్షణ

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 15వ వారం
చిట్కాలు / సూచనలు
 • కటి ఎముక వ్యాయామాలు చేయాలి. ఇవి చేయటంవల్ల తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు మూత్రం కారకుండా పెల్విక్ ఎముక బిగుతుగా ఉండడానికి ఉపయోగపడతాయి.
 • బాగా ఆరోగ్యకరమైన తాజా కూరగాయలు మరియు పండ్లు తినాలి. పిచ్చి నిల్వ పదార్థాలు, కొవ్వు వంటి పదార్ధాలు అతిగా తినొద్దు. మూడవ త్రైమాసికం వరకు మీకు ఎక్కువ కేలరీలు అవసరం లేదు. మీరు అర్హులు అయితే దగ్గరలో అందుబాటులో ఉన్న అంగన్వాడి సెంటర్లో గర్భిణీ స్త్రీల కొరకు సరఫరా చేసే ఆహారాన్ని తీసుకోవచ్చు.
 • చిన్న చిన్న మోతాదులో ఆహారం తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకేసారి రోజులో మూడుసార్లుగా తినడం వలన గుండెల్లో మంట వస్తుంది.
 • కళ్ళు తిరిగినట్లు అనిపిస్తే వెంటనే కూర్చోటానికి, పడుకోవటానికి చోటు వెతుక్కోండి. అలా కాని పరిస్థితుల్లో మోకాళ్ళ మీద కూర్చొని తల కిందకి వంచి ఉంచండి.
 • తలనొప్పిని తగ్గించుకోవడానికి నెత్తి మీద చల్లటి ఐసుని పెట్టుకోండి మరియు శుభ్రంగా ఉన్న ప్రదేశంలో విశ్రాంతి తీసుకోండి.

మీ వైద్యుడిని అడగండి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. నాకు యోని నుండి స్రావాలు వస్తున్నాయి. ఇది సహజమేనా?
 2. చిగుళ్ళ వ్యాధి ని ఎలా తగ్గించుకోవాలి?
 3. నేను పెరగవలిసిన బరువే పెరుగుతున్నానా?
 4. నాకు పొత్తి కడుపులో లేదా పొట్ట కింది భాగంలో పక్కన నొప్పిగా ఉంది ఇది సహజమేనా?
 5. నా రక్త పోటు సరిగ్గానే ఉందా? ప్రీఎక్లంప్సియా రిస్క్ ఏమైనా ఉంటుందా మరియు దానిని నివారించుకోవడానికి ఏ మందులు వాడాలి?

ముఖ్యమైన చర్యలు

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 15వ వారం
పాయింట్లు
 1.  గర్భిణీ సమయంలో చేయించుకోవాల్సిన అన్ని చెకప్ లకి వెళ్లి నేను మరియు నా కడుపులోని బిడ్డ యొక్క ఆరోగ్యం ఎలా వుందో తెలుసుకోవాలి.
 2. కటి ఎముక (పెల్విక్ భాగం ) ఆసనాలు చేయాలి
 3. కుషల్ యాంటినేటల్ వర్కషాప్కు హాజరు
 4. ప్రసూతికి ముందు చేయవలసిన యోగాసనాలు

మీకు ప్రశ్నలు ఉండవచ్చు

"చాలమంది ఆడవాళ్లకు ఇది జరుగుతుంది. ఇది సహజమే. మామూలుగా తెల్లగా, క్రీం రంగులో లేదా రంగు లేకుండా ఉంటుంది ఒకవేళ రంగు మారి, వాసనతో కూడిన స్రావం అవుతూ , నొప్పి రావటం అటువంటివి ఉంటే డాక్టర్ని కలవాలి."

 

"నేను నా బరువు ప్రతి వారం లేదా రెండు వారాలకు ఒకసారి ఇంటి వద్దనే చూసుకుంటున్నాను. నేను ఇలా ప్రతిసారి చూసుకోమని సలహా ఇస్తాను. డాక్టర్ క్లినిక్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నెలకొకసారి బరువు చూసుకోవచ్చు అంటారు."

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి