మీ శరీరం

ఏమి ఆశించాలి
మీ గర్భాశయం చాలా వేగంగా పెరుగుతుంది కాబట్టి ఇంకా మీరు గర్భవతి అన్న విషయాన్నిదాచలేరు.
మీకు ఇక నుంచి కొన్నిసార్లు ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుంది
ఇలా కేవలం మీరు గర్భవతి కావడం వలన కలిగిన హార్మోన్ మార్పుల వలన జరుగుతుంది
అప్పుడప్పుడు మీకు లోపల అనగా కడుపులో మీ బిడ్డ తిరగటం, కాలితో తన్నటం అనుభూతి చెందుతారు. అవి మీకు తెలియకపోయిన కంగారు / ఆందోళన పడనవసరం లేదు. కొందరు ఇపుడే తెలుసుకోలేరు.
మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి చాలా టెస్ట్లు చేయించుకుంటూ ఉండాలి. రక్తం ఇంకా మూత్ర పరీక్షలు చేయించుకోవాలి
స్వీయ రక్షణ

చిట్కాలు / సూచనలు
- వ్యాస్లీన్ లాంటి క్రీమ్ ని మీ ముక్కు కింద రాసుకోవాలి. ఎందుకంటే ముక్కు – ముక్కుదిబ్బడ వల్ల ఎండిపోవచ్చు.
- ఫైబర్/ పీచు పదార్ధం ఎక్కువగా ఉన్న పదార్థాలు తినాలి. పండ్లు, కూరగాయలు మరియు చిక్కుళ్ళు ఇంకా పప్పు ఇలాంటివి తినడం మరియు బాగా మంచినీళ్లు తాగడం వల్ల విరోచనం సాఫీగా జరుగుతుంది.
- తక్కువ కొవ్వు / వెన్న శాతం ఉన్న పాలు, పాల పదార్థాలు నుండి బాగా కాల్షియం మీ ఒంటికి అందేటట్లు చూడండి.
- వీపు మీద సున్నితంగా మర్ధన చేయించుకోవడం వలన నడుము కింది భాగంలో నొప్పి తగ్గుతుంది.
- రోజుకి రెండు సార్లు పళ్ళు శుభ్రంగా తోముకుని నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
ముఖ్యమైన చర్యలు

పాయింట్లు
- గర్భిణీ సమయం లో చేయించుకోవాల్సిన చెకప్ నిమిత్తం డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. రక్తపరీక్షలు మూత్రం పరీక్షలు ఇంకా అల్ట్రాసౌండ్ స్కాన్డె
- లివరీ / కాన్పు నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రసూతి కేంద్రాలను, హాస్పిటల్స్ అన్వేషించాలి. ఒకసారి ఆ కేంద్రాలను పరిశీలించి ప్రాధాన్యత తెలుసుకోవాలి.
- శ్రీమంతం కోసం ఏర్పాటు చేయాలి.
- దగ్గరి బంధువులను, ప్రాణ స్నేహితులను వారి ప్రసూతి (డెలివరీ/ కాన్పు) అనుభవాలను అడిగి తెలుసుకోవాలి.
మీకు ప్రశ్నలు ఉండవచ్చు
ఏ రకమైన పరీక్షలు చేయించుకోమని నాకు డాక్టర్ సలహా ఇస్తారు?
నేను రక్త పరీక్ష చేయించుకున్నాను. దానివల్ల నాది ఏ రకమైన రక్తం, ఇంకా నా రక్తంలో ఐరన్ శాతం ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. నాకు అదే పరీక్షలో హెచ్ఐవి మరియు హెపటైటిస్ బి , సిఫిలిస్ కూడా పరీక్ష చేశారు. నేను మూత్ర పరీక్ష కూడా చేయించుకున్నాను.అందులో నా ఒంట్లో ప్రోటీన్ విలువల శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇంకా ప్రీ eclampsia సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి. ఇది ప్రోటీన్ల శాతం తగ్గినప్పుడు తలెత్తే సమస్య అతి ప్రమాదకరమైన పరిస్థితి.
నాకు పొట్టకోసి పెద్ద ఆపరేషన్ చేస్తారా?
నాకు మా డాక్టర్ గారు పెద్ద ఆపరేషన్ విధానాలు, మత్తు మందుతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఆవిడ నాతో ఒకవేళ నాకు గాని నా బిడ్డకు గాని ఏదైనా ప్రమాదం ఏర్పడితే తప్ప సాధారణ కాన్పు చాలా శ్రేయస్కరం అని చెప్పింది. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ పెద్ద ఆపరేషన్ గురించి ఇంకా లోతుగా తెలుసుకో ఎందుకు ఎలా ఎప్పుడు ఎలా చేస్తారు అని.