17వ వారం

మీ శరీరం

changes in the body
ఏమి ఆశించాలి
మీకు సరదాగా, తమాషా అనుభూతిగా ఉంటుంది. మీ బిడ్డ లోపల కదులుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు చూడటానికి చాలా అందంగా ఉంటారు. మిలమిలలాడుతూ నిగారింపుగా ఉన్న చర్మం మెరుస్తూ ఉంటుంది. పొద్దున్నే ఉండే వికారం/ వాంతులు పూర్తిగా తగ్గిపోతాయి. మీకు ఇపుడు ఆకలి ఎక్కువ వేస్తుంది, ఎక్కువగా తింటారు. మీరు నిద్రలో పెద్దగా గురకలు పెడతారు దాని గురించి బాధపడవద్దు. అసహ్యంగా భావించవద్దు. రాత్రి బాగా నిద్ర పట్టేలా విశ్రాంతి తీసుకోండి.

బిడ్డ పరిమాణం

Week 17 size guide
ఏమి ఆశించాలి
మీ బిడ్డ ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ అంత పరిమాణంలో ఉంటుంది (సుమారుగా 11-12 సెం. మి పొడవు మరియు 150 గ్రాముల బరువు ఉంటుంది).

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించాలి
మీరు భోజనం చేశాక లేదా పెద్దపెద్ద శబ్దాలతో పాటలు విన్నప్పుడు లేదంటే కడుపును చేతితో మర్దన చేసినపుడు మీ బిడ్డ లోపల కదులుతుంది. మీరు మీ బిడ్డ తో మాట్లాడుతూ ఉండండి. మీ బిడ్డకి చిన్నగా గోర్లు పెరగడం కూడా మొదలవుతాయి. వేలిముద్రలు ఏర్పడతాయి. నీ బిడ్డకి ఎక్కిళ్లు వస్తాయి. అవి వచ్చినప్పుడు మీరు కూడా అనుభూతి చెందుతారు. మీ యొక్క గర్భ సంచికి అంటుకుని ఉన్న మాయ మరియు గర్భసంచి క్రమంగా పెద్దగా అవుతుంది. ఇది పెరుగుతున్న బిడ్డ బరువును బట్టి తయారవుతుంది. మాయ బిడ్డకి కావలసిన పోషకాలు, విటమిన్స్ మరియు బిడ్డ ఎదుగుదలకు కావలసిన ఖనిజ, లవణాలను అందిస్తుంది.

స్వీయ రక్షణ

Mission pageTaking care 2Our services page
చిట్కాలు / సూచనలు
 • ఇతరులు మీ గర్భం గురించి అనేక ప్రశ్నలు అడుగుతారు. కొంతమందికి మీ పొట్టను పట్టుకోవాలనిపిస్తుంది.
 • మీ యొక్క అనుభూతిని ఇతరులకు పంచుకోవటం మంచి విషయమే కానీ మీకు నచ్చకపోతే మొహమాటం పడకుండా వద్దు అని చెప్పండి.
 • ఒమేగా 3 ఉన్న చేపలను ఎక్కువగా తినాలి. ఉదాహరణకి బొచ్చు చేప ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ యొక్క మెదడు ఎదుగుదలకు తోడ్పడుతుంది.
 • వారానికి 350 గ్రాముల చేపలు, మాంసం తినాలి. కొన్ని రకాల చేపలను తినకూడదు. ఉదాహరణ సొరచేప ఎందుకంటే వీటిలో గాఢత ,పాదరసం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి
 • విటమిన్ సి ఎక్కువగా ఉన్న పదార్థాలను తినాలి. వాసన, గాఢత లేని మాయిశ్చరైజర్స్ వంటికి వాడాలి. దీనివలన చర్మం చారలు రావు.
 • తిన్న వెంటనే నిద్రపోకూడదు. అలా చేస్తే సరిగ్గా అరుగుదల లేక గుండెల్లో మంట రావడం లాంటివి వస్తాయి

మీ వైద్యుడిని అడగండి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. నాకు యోని నుండి స్రావాలు వస్తున్నాయి. ఇది సహజమేనా?
 2. చిగుళ్ళ వ్యాధి ని ఎలా తగ్గించుకోవాలి?
 3. నేను పెరగవలిసిన బరువే పెరుగుతున్నానా?
 4. నాకు పొత్తి కడుపులో లేదా పొట్ట కింది భాగంలో పక్కన నొప్పిగా ఉంది ఇది సహజమేనా?
 5. నా రక్త పోటు సరిగ్గానే ఉందా? ప్రీఎక్లంప్సియా రిస్క్ ఏమైనా ఉంటుందా మరియు దానిని నివారించుకోవడానికి ఏ మందులు వాడాలి?

ముఖ్యమైన చర్యలు

Todoicon
పాయింట్లు
 1. నా భర్తని పొట్ట మీద చెయ్యి పెట్టి బిడ్డ కదలికలు గురించి ఏమి అనుకుంటున్నారో ఏమనిపిస్తుందో తెలుసుకోవాలి.
 2. 20వ వారం అల్ట్రాసౌండ్ స్కాన్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలి.
 3. కుషల్ వర్క్ షాప్ లో సైన్అప్/ జాయిన్ అవ్వాలి.
 4. కుషల్ లో నా బరువు ఇంకా రక్తపోటును రికార్డు చేయాలి.
 5. తలకి మర్దన వంటివి చేయించుకోవాలి.

మీకు ప్రశ్నలు ఉండవచ్చు

“అందరూ వేరు వేరుగా ఉంటారు.నాకైతే నేను ఆకర్షణీయంగా లేను అని అనుకునే దాన్ని. నా శరీరంలోని మార్పులకు అసలు బిడ్డను బాధ్యతగా చూసుకోగలనా లేదా అని గాభరా పడ్డాను. దాని గురించి నేను మా డాక్టర్ గారితో మాట్లాడాను మరియు కుషల్ వారి మద్దతు నిచ్చే వర్కుషాపు కి వెళ్ళాను.. అది నాకు సహాయపడింది.”

“నేను విటమిన్ ఎ ఎక్కువగా ఉన్న బ్యూటీ ఉత్పత్తులను వాడొద్దని చెప్తాను. గర్భంతో ఉన్నప్పుడు నా చర్మం సున్నితంగా మారింది. అందుకే కొత్త ఉత్పత్తులను వేటిని ప్రయోగించలేదు”.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి