18వ వారం

మీ శరీరం

image to flag post changes in the body section
ఏమి ఆశించాలి
మీ శరీరము మీరు వికారమైన అనుభూతిని పొందుతారు. ఎందుకంటే మీ పొట్ట చాలా పెద్దదిగా అయిపోయింది. మీ రొమ్ములు/ ఛాతి పరిమాణం పెద్దదిగా అవుతుంది. మీ పొట్ట క్రింద ఒక నల్లటి గీత లేదా చార ఏర్పడటం గమనించి ఉంటారు. ఇది సాధారణంగా చర్మం రంగు మారడం ( పిగ్మెంటేషన్) దీని గురించి కంగారు పడవద్దు. నడుమునొప్పి, వేరే ఒంటి నొప్పులు ఉండొచ్చు.

బిడ్డ పరిమాణం

Image of cucumber as Week 18 size guide
ఏమి ఆశించాలి
మీ బిడ్డ ఇపుడు కడుపులో కీరదోసకాయ అంత పరిమాణంలో ఉండిద్ది. (సుమారుగా 13-14 సెం. మి పొడవు మరియు 180-190 గ్రాముల బరువు ఉంటుంది)

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించాలి
శిశువు మీ మాటలను వినాలనే ఆతృతతో ఉంది. మీరు మీ బిడ్డతో మాట్లాడండి. మీ బిడ్డ పూర్తిగా ఏర్పడుతుంది. అనగా అమ్మాయిగా, లేదా అబ్బాయిగా మీ బిడ్డ యొక్క నరాల వ్యవస్థ త్వరగా వృద్ధి చెందుతుంది. మీ బిడ్డ ఆవలించగలదు. ఎక్కిళ్లు కూడా వస్తాయి

స్వీయ రక్షణ

చిట్కాలు / సూచనలు
  • మీరు సోఫా లేదా కుర్చీలో నుండి లేచేటపుడు మైకంగా లేదా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మీ యొక్క రక్తపోటు (బ్లడ్ ప్రెషర్ ) సాధారణ స్థాయి కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది.
  • మీ యొక్క పొట్టని ఇతర గర్భిణీ స్త్రీలతో పోల్చుకుని చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి గర్భిణీ స్త్రీ కి వేరు వేరుగా ఉంటుంది. మీరు ఒకటే గమనించుకోండి అది మీ ఆరోగ్యం బాగుందా మరియు డాక్టరుగారి వద్దకు క్రమంగా చెకప్ కు వెళ్తున్నారా లేదా అనేది.
  • మీరు విశ్రాంతి తీసుకునేటపుడు పాదాల కింద ఎత్తు పెట్టుకోండి. దీనివలన మీకు నడుంనొప్పి రాకుండా ఉంటుంది
  • మీరు నుంచుని ఉన్నపుడు మీ బరువు వెనుక వీపు మీద పడకుండా ఉండడానికి మీ ఒక పాదాన్ని కొంచెం ఎత్తు ఉన్న పీట లేదా స్టూల్ మీద పెట్టడం మంచిది
  • ఎక్కువగా జ్యూస్స్, నీరు వంటివి తాగడం వలన మరియు పీచు పదార్థం ఎక్కువ ఉన్న వాటిని తీసుకోవడం వలన మలబద్దకం ఇబ్బంది ఉండదు. దీనివలన మీరు బాత్రూం కి వెళ్ళినపుడు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటారు.

మీ వైద్యుడిని అడగండి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
  1. నా బరువు పెరుగుదల సరియైనదేనా?
  2. ఈ గర్భంతో ఉన్నప్పుడు నేనేమైనా అతి ప్రమాదకరమైన సమస్యలకు లోనవుతానా?
  3. నా పాదాలు, చీలమండలు ఉబ్బుతున్నాయి . అది పర్వాలేదా?
  4. నా బిడ్డ ఎదుగుదల బాగానే ఉందా?

ముఖ్యమైన చర్యలు

పాయింట్లు
  1. పాదాల కింద కి ఒక చిన్న బల్ల ఉంచుకోవాలి
  2. ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇంకా గర్భ సమయంలో వేసుకునే విటమిన్ టాబ్లెట్లు తెచ్చి పెట్టుకోవాలి
  3. మీ యొక్క శ్రేయస్సు కోరే కుషల్ వర్క్ షాప్ లో సమయం బుక్ చేసుకోవాలి
  4. డాక్టర్ దగ్గరకు అపాయింట్మెంట్ తీసుకోవాలి
  5. భర్త వద్ద కూర్చుని అతనితో నా శరీరంలో జరిగే మార్పులను మరియు నాకు ఏమనిపిస్తుంది అనే విషయాన్ని తెలియజేయాలి

మీకు ప్రశ్నలు ఉండవచ్చు