23వ వారం

మీ శరీరం

changes in the body
ఏమి ఆశించాలి
మీకు రొమ్ముల నుండి పాలు వంటివి (కొలస్ట్రం) వస్తాయి. ఇవి మీ బిడ్డ ఎదుగుదలకు, రోగాల బారిన పడకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. మీకు పక్కటెముకలు నొప్పి వస్తుంది. ఎందుకంటే మీ పక్కటెముకల పంజరం సాగుతుంది. మీరు ఎండలోకి వెళ్ళినట్లయితే త్వరగా అలిసిపోతారు. మరియు మీరు ఈ సమయంలో కొన్ని, కొన్ని విషయాలు మర్చిపోవడం జరుగుతుంది. నెలలు పెరుగుతున్న కొలది మీకు ఆత్రుత, ఆందోళన పెరుగుతాయి.

బిడ్డ పరిమాణం

Week 23 - size guide
ఏమి ఆశించాలి
ఇప్పుడు బిడ్డ పంపర పనస కాయ అంత పరిమాణంలో ఉంటుంది (సుమారుగా 28సెం. మి పొడవు మరియు 475 గ్రాముల బరువు ఉంటుంది).

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించాలి
మీ బిడ్డ ఊపిరి తీసుకోవడం సాధన చేస్తుంది. మీ బిడ్డ కడుపులో తన్నటం వంటివి వాటి వలన మీ పొట్ట కదలటం వంటివి మీరు గమనిస్తారు. బిడ్డ యొక్క మెదడు పెరగడం ప్రారంభమవుతుది. మీ యొక్క గొంతును (స్వరాన్ని) గుర్తిస్తుంది. బిడ్డ ఇక బరువు ఎక్కువగా పెరుగుతుంది. బిడ్డ యొక్క గుండె చప్పుడు స్టెతస్కోప్ ద్వారా తెలుసుకోవచ్చు( వినవచ్చు).

స్వీయ రక్షణ

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 23వ వారం
చిట్కాలు / సూచనలు
 • ముఖానికి మేకప్ వేసుకోవటం వంటివి చేయొద్దు. మీ ముఖంపై ఏర్పడిన నల్ల మచ్చలు , ముడతలు వంటివి ప్రసవానంతరం కొన్ని నెలలలో తగ్గిపోతాయి.
 • మీరు ఈ గర్భ సమయంలో వచ్చే ఆందోళన తగ్గించుకోవడానికి కొన్ని రిలాక్సేషన్ విధానాలు సాధన చేయండి.
 • పడుకునేటప్పుడు కాళ్ళ మధ్య దిండు పెట్టుకొని, మోకాళ్ళు మడిచి పెట్టుకుని నిద్ర పొండి.
 • దీనివల్ల మీకు రాత్రులు బాగా నిద్ర పడుతుంది.
 • మీ పక్కన ఒక వాటర్ బాటిల్ లేదా గ్లాసులో నీళ్ళు ఉంచుకోండి.
 • మీరు ఎక్కువ విటమిన్లు మరియు ఐరన్ టాబ్లెట్లు తీసుకుంటున్నారా అనేది గమనించండి.

మీ వైద్యుడిని అడగండి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. నేను తొందరగా అలిసిపోతున్నట్లు , నిద్ర వస్తున్నట్లు మరియు ఊపిరి ఆడకుండా ఉండటం వంటివి నాలో గమనించాను. ఏది ఏమైనా సమస్య?
 2. నాకు బాగా వీపు నొప్పి వస్తుంది? నేను ఏమి చేయాలి?
 3. నేను టాయిలెట్ కి వెళ్తున్నపుడు మంట అనిపిస్తుంది. ఈ సమస్యకి నేను ఏమి చేయాలి?

ముఖ్యమైన చర్యలు

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 23వ వారం
పాయింట్లు
 1. నేను పడుకునేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకుని పడుకోవాలి.
 2. విటమిన్లు ఇంకా ఐరన్ టాబ్లెట్లు వాడుకోవాలి.
 3. కుషల్ శ్రేయోస్సు వర్కుషాప్ కి హాజరు కావాలి.
 4. డాక్టర్ దగ్గర చెకప్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలి.
 5. రోజు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి.

మీకు ప్రశ్నలు ఉండవచ్చు

"నన్ను అలవాటు పూర్తిగా మానుకోమని చెప్పారు. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల గర్భస్రావం లేదా బిడ్డ పుట్టినప్పుడు తక్కువ బరువుతో పుట్టడం జరుగుతాయి అన్నారు. పూర్తిగా మానేయడం కుదరకపోతే తాగడం తగ్గించి రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి!"

"అవి బిడ్డ కడుపులో తిరగడం లేదా తన్నడం ద్వారా కలిగేవి. వీటి అర్ధం బిడ్డ ఆరోగ్యంగా ఉంది అని."

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి