మీ శరీరం

ఏమి ఆశించాలి
మీరు ఇప్పుడు వేగంగా బరువు పెరుగుతూ ఉంటారు. మీతో పాటు మీ బిడ్డ కూడా పెరుగుతుంది. మీకు శరీరమంతా నొప్పులు రావటం మొదలవుతాయి. ఎందుకంటే బిడ్డ లోపల విపరీతంగా కదులుతుంది. మీ పొట్ట బాగా పెరగటం వల్ల మీ బొడ్డు బయటకు పొడుచుకువస్తుంది. సెక్స్ లో పాల్గొనడానికి అంతగా ఉత్సాహం ఉండకపోవచ్చు. మీకు రాత్రులు నిద్ర కూడా పట్టకపోవచ్చు.
మీ శిశువు

ఏమి ఆశించాలి
మీ బిడ్డ ఇపుడు పుట్టినా జీవించగల స్థితిలో ఉంది. కానీ తప్పనిసరిగా తల్లి గర్భంలోనే ఇంకొక మూడు నెలలు ఉండాలి. బిడ్డ యొక్క ప్రతి అవయవము అనగా కళ్ళు, చేతులు, తల ఇలా చక్కగా తయారయ్యాయి. మీ బిడ్డ ఇపుడు మీరు కానీ మీభర్త మాటలు కానీ వినగలదు మరియు మీరు పొట్ట మీద చేయి వేసి రుద్దిన బిడ్డ కదలికలు మీకు తెలుస్తాయి.
స్వీయ రక్షణ

చిట్కాలు / సూచనలు
- ఇంటి చిట్కాలను పాటించండి - నిద్రపట్టడానికి ధ్యానం చేయటం, వేడి పాలు తాగటం వంటివి
- తలస్నానము తర్వాత జుట్టు ఆరినాక కొంచెం కొబ్బరి నూనె రాయండి.
- చేతుల మీద పడుకోవడం ఆపేయండి. దానివల్ల మీ చేతులు లేకుండా నొప్పులు రాకుండా ఉంటాయి
- చల్లని నీటిలో కాళ్లు, చేతులు ఉంచడం లేదా ఐస్ ప్యాక్ వాడటం వంటివి చేయడం ద్వారా ఎర్రబడటం, దురదలు వంటివి రాకుండా ఉంటాయి.
- సాక్సులు వేసుకోవటం ఆపేయండి.
- కాళ్ళు చాపి మీ పాదాలను, కాలివేళ్ళను గుండ్రంగా తిప్పుతూ చిన్న వ్యాయామం లాగా చేయండి,దీని వలన కాళ్ళు పట్టుకుపోవడం, నొప్పి వంటివి తగ్గుతాయి.
మీ వైద్యుడిని అడగండి
మీకు ప్రశ్నలు ఉండవచ్చు
నేను నా బరువు కరెక్ట్ గానే పెరుగుతున్నానా?
"బరువు పెరగడం అనేది ఒక స్త్రీ నుంచి మరొక స్త్రీకి మారుతూ ఉంటుంది.
గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ఒక మోస్తారుగా 10 నుంచి 14 కేజీల బరువు పెరుగుతుంది. రెండవ త్రైమాసికంలో (4-6 నెలలు) వారానికి 400 నుంచి 425 గ్రాముల బరువు పెరుగుతుంది. మీరు అనుకున్న బరువు పెరగడం లేదు అని మీకు అనిపిస్తే మీ డాక్టర్ని సంప్రదించి వారి సలహా ప్రకారం నడుచుకోండి . నేను మా డాక్టర్ గారిని సంప్రదించాను."
నేను కోరింత దగ్గు కి టీకా ఏమైనా వేయించుకోవాలా?
"నన్ను రెండవ త్రైమాసికంలో చేయించుకోమన్నారు. ఈ టీకా కోరింతదగ్గు రాకుండా చేస్తుంది . ఒకసారి వేస్తే బిడ్డ పుట్టిన కొన్ని రోజుల వరకు కూడా రక్షణగా ఉంటుంది. తల్లికీ బిడ్డకూ ఇద్దరికీ ఇది మంచిది. దీని విషయమై మీరు మీ డాక్టర్ని కలిసి వారి సూచనను పాటించాలి."