25వ వారం

మీ శరీరం

changes in the body
ఏమి ఆశించాలి
మీ గర్భసంచి చాలా వేగంగా పెరుగుతుంది. అది ఇప్పుడు పెద్ద బంతి ఆకారంలో ఉంటుంది! మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే మీరు చేయగలిగిన పనులు కూడా ఎప్పుడు చేయలేరు. ఉదాహరణకి - వంగటం వంటివి. నడుము నొప్పి వల్ల మీకు చిరాకుగా అనిపిస్తుంది. మీ వేళ్ళు మొద్దుబారి పోయినట్లు అనిపిస్తాయి. మీరు చూడటానికి ముఖం కాళ్ళు, చేతులు లావుగా కనిపిస్తారు. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సంతోషంగా ఉండండి!

బిడ్డ పరిమాణం

Week 28 baby size
ఏమి ఆశించాలి
మీ బిడ్డ పెద్ద వంకాయ అంత పరిమాణం లో ఉంటుంది (సుమారుగా 32 సెం. మి పొడవు మరియు 640 గ్రాముల బరువు ఉంటుంది)

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించాలి
మీ బిడ్డకు ఎక్కిళ్లు వస్తాయి. బిడ్డ యొక్క మెదడు, ఊపిరితిత్తులు, జీర్ణ కోసం బాగా తయారయ్యాయి. కిడ్నీలు పనిచేస్తున్నాయి. శిశువు మూత్రం కూడా పోస్తుంది. బిడ్డ తన నాలుకను బయటకు పెడుతూ ఉంటుంది. విరేచనం అవడానికి వీలుగా ప్రేగు కదలికలు ప్రారంభమవుతాయి.

స్వీయ రక్షణ

Mission pageTaking care 2Our services page
చిట్కాలు / సూచనలు
 • తినేటప్పుడు నిటారుగా కూర్చుని తినండి. కొంచెం, కొంచెం ఆరోగ్యకరమైన భోజనం చేయండి. టీ, కాఫీ వంటివి తీసుకోవద్దు. ఇవి పాటించడం వలన అజీర్తి కాకుండా ఉంటుంది మరియు గుండెల్లో మంట, వికారంగా ఉండటం, పొట్ట ఉబ్బరం వంటివి ఉండవు.
 • కంటి చూపు తగ్గినట్లు, మసకబారినట్లు అనిపిస్తే కంగారు పడవద్దు. అది ప్రసవం జరిగాక మామూలై పోతుంది.
 • చర్మం దురదగా అనిపిస్తే కాలమిన్ లోషన్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి
 • నోటి శుభ్రత -పాటించాలి. - 2రోజుకు సార్లు పళ్ళు శుభ్రం చేసుకోవాలి. చిగుళ్ల వ్యాధి అనేది తీవ్రమైన సమస్య. ఇది ఒక్కోసారి నెలలు నిండకుండా కాన్పు కావడానికి లేదా గర్భిణీ సమయంలో అనారోగ్యానికి దారితీస్తుంది.
 • చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, ఎక్కువ నీరు త్రాగడం మరియు ఎక్కువ ఫైబర్ (పీచు పదార్ధం) ఉన్న ఆహరం తీసుకోవడం ద్వార విరేచనం సాఫీగా అవుతుంది.

మీ వైద్యుడిని అడగండి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. నా ముఖం, కాళ్ళు , చేతులు వాచినట్లు మరియు ఉబ్బినట్లు ఉన్నాయి. ఇంకా నాకు తలనొప్పిగా ఉంటుంది. ఈవిధంగా జరగడానికి అధిక రక్తపోటు ఏమైనా కారణమా?
 2. కాళ్ళు కదుపుతుంటే బాగా తిమ్మిరిగా అనిపిస్తుంది . ఇది ఏమైనా రక్తహీనత వలన కలుగుతుందా?
 3. నేను సంతోషంగా ఉండలేకపోతున్నా ! నేను డిప్రెషన్ లోకి వెళ్తున్నానా?
 4. నా మణికట్టు మరియు వేళ్ళు కదుపుతుంటే చాలా నొప్పిగా ఉన్నాయి. నేను ఏమైనా అక్యూపంక్చర్ చికిత్స తీసుకోవాలా?

ముఖ్యమైన చర్యలు

Todoicon
పాయింట్లు
 1. పెరగవలిసిన బరువు పెరుగుతున్నానా లేదా చూసుకోవాలి
 2. కుషల్ వర్క్ షాప్ లో హాజరు కావడానికి సమయం చూసుకోవాలి
 3. పోలిక్ యాసిడ్ మరియు విటమిన్ టాబ్లెట్లు తెచ్చి వాడుకోవాలి
 4. మా డాక్టర్ దగ్గర చెకప్ నిమిత్తం అపాయింట్మెంట్ తీసుకోవాలి
 5. ప్రసవానంతరం డిప్రెషన్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవాలి

మీకు ప్రశ్నలు ఉండవచ్చు

"బర్త్ ప్లాన్స్ అనేవి మీ యొక్క వ్యక్తిగతమైనవి. ఇవి ప్రసవం మరియు ప్రసవానంతరం సంబంధించిన వాటికీ చెందినది. ప్రసవం ఎక్కడ కావాలి అనుకుంటున్నారు, ఎలాంటి కాన్పు ఆశిస్తున్నారు అనగా సిజేరియన్ , లేదా సాధారణ కాన్పు మరియు బిడ్డ పుట్టిన వెంటనే ఏమి చేయాలి ఇటువంటివి.
నేను నా భర్తతో కలిసి ప్లాన్ చేసుకున్నాను. ఇవి అనుకున్నవి అనుకున్నట్లు జరిగినా లేదా ఏమైనా కొన్ని మార్పులు చేసుకోవడానికి కూడా వీలుగా ఉండాలి!"

"గర్భసమయంలో ఉండే హార్మోన్స్ వలన జుట్టు రాలడం తగ్గుతుంది. ప్రస్తుతానికి ఎంజాయ్ చేయండి. ప్రసవానంతరం కొంత వరకు తిరిగి జుట్టు ఊడటం ఉంటుంది!"

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి