మీ శరీరం

ఏమి ఆశించాలి
మూడవ త్రైమాసికం (6-9 నెలలు)లోకి వచ్చాక మీరు మరింత అలసటగా బాగా అయోమయంగా ఉంటారు. ఎందుకంటే మీరు ఇంకా బరువు మోయాల్సి వస్తుంది. ఇప్పటినుంచి మీకు బాగా కాళ్ళు నొప్పులు వస్తాయి. బాగా చిరు తిండి తినడం లేదా ముడుచుకుని కూర్చోవడం వంటివి చేయవద్దు. మీ బొడ్డు బాగా బయటికి పొడుచుకు వచ్చి ఉండిద్ది. పొట్ట కింది నుంచి నల్లగా మారి కనిపిస్తూ ఉంటుంది.
మీ శిశువు
స్వీయ రక్షణ

చిట్కాలు / సూచనలు
- రోజువారీ పనులకు మరింత సమయం కేటాయించండి బస్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్లడం వంటిపనులు చేయడం.
- ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలి లాగా కదలకుండా కూర్చోకండి.
- చాలా వరకు మీ బిడ్డ కదలికలు ప్రక్రియ ఎలా ఉందో తెలుసుకోండి. ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు కదులుతుందో తెలుసుకోండి.
- పచ్చిమాంసం, కోడిగుడ్లు లేదా చేపని పట్టుకున్నాక చేతులను సబ్బు నీళ్లతో బాగా కడుక్కోండి.
- తొక్క తీసుకుని తినేవి అయినా సరే పళ్ళు, కూరగాయలు బాగా కడుక్కుని తినాలి.
- పచ్చి గుడ్లు తీసుకోవద్దు.
మీ వైద్యుడిని అడగండి

ప్రశ్నలు
- నా బిడ్డ కదలికలు నాకు అంత బాగా తెలియట్లేదు. పర్వాలేదా?
- నేను ఈసారి వచ్చేటపుడు ప్రసవానికి సంబందించిన ప్లాన్ తీసుకుని రావాలా?
- నిద్రలో నేనెందుకు తంతున్నాను?
- నా కళ్ళు ఎండిపోయినట్లుగా చికాకుగా ఉన్నాయి. అది సాధారణమా?
- నాకు తలపోటు, మైగ్రేన్ వస్తున్నాయి, గర్భందాల్చాక ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది, దీనికి ఎలాంటి మందులు వాడాలి?
ముఖ్యమైన చర్యలు

పాయింట్లు
- రోజు చురుకుగా ఉండేట్లు చేసుకోవాలి.
- మంచి వైఖరిని అలవరచుకోవాలి.
- నేను బరువు ఎంత ఉన్నాను అని చూసుకోవాలి.
- కుషల్ వారి శ్రేయస్సు కోరే వర్క్ షాపుల సమయం తెలుసుకోవాలి.
- పోలిక్ యాసిడ్ మరియు విటమిన్ మాత్రలను వాడుకోవాలి.
- గర్భకాలంలో చేయించుకోవాల్సిన చెకప్ నిమిత్తం డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి.
మీకు ప్రశ్నలు ఉండవచ్చు
నాకు అసలు నిద్ర పట్టటలేదు. నా కాళ్ళ నొప్పులు చాల విపరీతంగా వస్తున్నాయి.
"నొప్పిగా ఉన్న చోట బాగా మర్ధనా చేసుకోవడం ఉపయోగపడుతుంది. నేను మంచం మీద ఉన్నపుడు చీలమండ మరియు పాదంకి సంబంధించిన వ్యాయామం చేసుకునేదాన్ని. కాలి వేళ్ళను లాక్కునే దాన్ని. ఇవన్నీ చాలా ఉపయోగపడ్డాయి."
నాకు కొంచెం కొంచెం నెగటివ్ గా ఆలోచనలు వస్తున్నాయి. మంచం దిగడం అసలు ఇష్టం ఉండటం లేదు?
"మీ డాక్టర్ తో మాట్లాడటం మంచిది. మీ భర్తతో కానీ స్నేహితురాలితో కానీ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది. మీ బుర్రలో నుంచి నెగిటివ్ ఆలోచనలను తీసేయండి. ఆడవాళ్ళు ఎవరైతే పాజిటివ్ ఆలోచనలను అణచివేసుకుంటారో (ఉదా:- నేను సంతోషంగా ఉండుటకు అర్హురాలు కాదు) ఇలాంటివి ప్రసవం అయ్యాక వచ్చే డిప్రెషన్ వ్యాధికి దారితీస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే వారి సలహా మీకు ఉపయోగపడుతుంది."