27వ వారం

మీ శరీరం

changes in the body
ఏమి ఆశించాలి
మీకు చాలా అలసటగా అనిపిస్తుంది. పగలు కూడా నిద్ర పోండి. మీరు ఇప్పుడు బాగా కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటారు. మీరు ఇక మీ మాటే వింటారు. ఎదుటి వారి మాటలకూ తావు ఇవ్వరు. మీ బిడ్డ కి ఏది మంచిది అని ఆలోచిస్తూ ఉంటారు. మీకు చెప్పులు షూస్ తొడుక్కోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీ పాదాలు ఉబ్బిపోయి ఉంటాయి. మీ పొట్ట చుట్టూ చర్మం చారలు వచ్చిసాగిపోయినట్లు మరియు దురదగా అనిపిస్తుంది.

బిడ్డ పరిమాణం

Baby size_week 27
ఏమి ఆశించాలి
మీ బిడ్డ పెద్ద క్యాబేజీ అంత పరిమాణంలో ఉంటుంది (సుమారుగా 36 సెం. మి పొడవు మరియు 840 గ్రాముల బరువు ఉంటుంది).

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించాలి
మీ బిడ్డ యొక్క ఊపిరితిత్తులు ఊపిరిని మంచిగా తీసుకుంటున్నాయి. బిడ్డయొక్క అవయవాలు బాగా తయారయ్యాయి అతని లేదా ఆమెది చర్మం ముడతలు లేకుండా ఉన్నాయి. బిడ్డ ఇపుడు మన పాదం అంత పొడవు ఉండి రెండు పౌండ్లు బరువు ఉంటుంది. బిడ్డ నాలుగు వారాల క్రితం కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుంది. మీ భర్త స్వరాన్ని కూడా గుర్తిస్తుంది. మీ భర్తని కూడా మాట్లాడమని చెప్పండి! మీరు బాగా కారంగా ఏమైనా తింటే మీ బిడ్డ ఎక్కిళ్ళు రూపంలో స్పందిస్తుంది!

స్వీయ రక్షణ

Mission pageTaking care 2Our services page
చిట్కాలు / సూచనలు
 • ఎప్పుడూ పక్కకు తిరిగి పడుకోవాలి. వీపు మీద పడుకోవద్దు. కొందరు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి అని చెప్పారు. వీపి మీద పడుకుంటే పుట్టబోయే బిడ్డ చచ్చిపోయి పుట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
 • ఎక్కువసేపు కూర్చోకూడదు, నుంచోకూడదు. మీ పాదాలు కనుక బాగా వాస్తుంటే డాక్టర్ను కలవండి.
 • కాళ్లు ఎత్తులో పెట్టుకొని పడుకోండి.
 • ప్రతి దానిలోనూ వెలుతురు కోణం చూడండి. మీరు పడే ఇబ్బందులు, బాధలు అన్నీ ప్రసవం అయ్యాక అవే పోతాయి.
 • వేడి వల్ల వచ్చిన రాష్ పై చల్లనిది ఏమైనా అదిమి పెట్టండి.
 • ముఖ్యంగా ఉదయం పుట లేచిన తర్వాత కళ్ళు ఉబ్బుగా, మంటగా ఉంటె దోసకాయ ముక్కలను కంటి మీద పెట్టండి.

మీ వైద్యుడిని అడగండి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఊపిరి ఆడకుండా, ఉక్కిరిబిక్కిరిగా అదే సమయంలో మాట్లాడలేకపోతున్నా మరియు నాకు గుండెదడగా కూడా అనిపిస్తుంది. అది సహజమేన?
 2. ప్రసవం కోసం నేనేమైనా ప్రత్యేకంగా తరగతులకు హాజరు అవ్వాలా?
 3. నా పాదాలు ఎంతలా ఉబ్బి పోయాయి అంటే నేను చెప్పులు కూడా వేసుకో లేక పోతున్నాను అది సహజమేనా?
 4. నేను ఉండవలసిన బరువు పెరిగేనా? ఆరోగ్యకరమైన బిడ్డ కోసం నేను ఇంకేమైనా చెయ్యాలా?

ముఖ్యమైన చర్యలు

Todoicon
పాయింట్లు
 1. నేను ఎప్పుడూ పక్కకి తిరిగి నిద్ర పోవాలి.
 2. పడుకునేటప్పుడు మోకాళ్ళ మధ్యలో దిండు మరియు పొట్టకి పక్కన ఇంకో దిండు పెట్టుకొని నిద్ర పోవాలి.
 3. నా భర్తని నా పొట్ట మీద చేవిపెట్టి కడుపులో బిడ్డ గుండె చప్పుడు వినమని కోరాలి.
 4. కుషల్ యాప్ లో నా బరువు, రక్తపోటు నమోదు చేయాలి.
 5. కొన్ని యోగాసనాలు సులభంగా ఉన్న విధానాలను నేర్చుకుని విశ్రాంతి పొందాలి.

మీకు ప్రశ్నలు ఉండవచ్చు

“రోజు తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం నాకు ఉపయోగపడింది. క్యాలీఫ్లవర్, ముల్లంగి లాంటివి తినటం ఆపేసి బాగా పాలకూర, క్యారెట్లు తిన్నాను. నన్ను బాగా మంచి నీళ్ళు తాగమని కొంచెం, కొంచెంగా ఎక్కువ సార్లు ఆహరం తినమన్నారు.”

“మీరు సహజంగానే అలా ప్రవర్తిస్తారు. మీరు చేయాల్సిందల్లా మీ మరియు మీ బిడ్డ ఆరోగ్యం చూసుకోవడమే. మీరు కొన్ని హద్దులు పెట్టుకోండి. అవి రాబోయే కాలానికి పనికొస్తాయి.”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి