28వ వారం

మీ శరీరం

changes in the body
ఏమి ఆశించాలి
మీరు మూడవ త్రైమాసికంలో ఉన్నారు. మీరు ఇప్పుడు కొత్త లక్షణాలను గమనిస్తారు. ముక్కులో నుంచి రక్తం కారడం, తిన్నది అరగక పోవడం వంటివి. మీ పాదాలు వాపుతో ఉంటాయి. మీ నడుములో విపరీతమైన నొప్పి వస్తుంది. ఊరికే అలసిపోతారు. మీ బిడ్డ తన్నటం వల్ల రాత్రులు నిద్ర పట్టదు. పగలు ఆందోళనగా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. కడుపు లోపల బిడ్డ అస్తమానం కదులుతూ ఉండి మీకు విశ్రాంతి లేకుండా చేయటం వల్ల కోపం తెప్పిస్తుంది!

బిడ్డ పరిమాణం

Week 28 baby size
ఏమి ఆశించాలి
బిడ్డ ఇపుడు ఇప్పుడు పెద్ద వంకాయ అంత ఉంటుంది (సుమారుగా 36 సెం. మి పొడవు మరియు 1000 గ్రాముల బరువు ఉంటుంది).

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించాలి
శిశువు గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది (140 bpm) కానీ 9-10 వారాల్లో కొట్టుకున్నంత వేగంగా కాదు. బిడ్డ తన నాలుకని బయటపెట్టి రకరకాల ముఖకవళికలు పెడుతుంది! పుట్టటానికి వీలైన రీతిలో బిడ్డ తన పోసిషన్ని మార్చుకుంటుంది. ఊపిరి తీసుకోవటం సాధన చేస్తుంది. బహుశా ఇప్పుడు కలలు కంటుంది!

స్వీయ రక్షణ

Mission pageTaking care 2Our services page
చిట్కాలు / సూచనలు
 • మీరు మీ 28వ వారపు చెకప్ చేయించుకోవాలి.
 • గర్భకాలంలో మీ డాక్టర్ రక్తపోటు ఎంత ఉంది అనేది నిర్ధారిస్తారు. మూత్రపు పరీక్షలు చేసి అందులో ప్రోటీన్ శాతం చూస్తారు. పరీక్షల ఫలితాలు మరియు చేయవల్సిన ఇతర పరీక్షల గురించి మీతో డాక్టర్ గారు మాట్లాడుతారు.
 • ప్రసవం యొక్క గుర్తులు తెలుసుకోవాలి.
 • గర్భంతో ఉన్నప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ల గురించి తెలుసుకోవాలి.
 • మీకు సయాటికా నొప్పి వస్తే వేడి నీటి కాపడం పెట్టుకోండి. బాగా విశ్రాంతి తీసుకోండి. సయాటికా నొప్పి అనగా బాగా విపరీతమైన నొప్పి, మొద్దుబారి పోవడం, తిమ్మిరి ఎక్కడం వంటివి పిరుదుల నుండి మొదలై కాళ్ళ లోకి వెళ్తుంది.
 • ఆర్. హెచ్ పరిస్థితి తెలుసుకోవాలి.ఏమైనా వాక్సిన్ / ఇంజక్షన్ వంటివి తీసుకోవాలా అనేది తెలుసుకోవాలి.

మీ వైద్యుడిని అడగండి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. ప్రోటీన్ శాతం గురించే తెలుసుకోవడానికి ఏమైనా మూత్రపరీక్షలు చేయించుకోవాలా?
 2. స్క్రీనింగ్ పరీక్ష యొక్క ఫలితాలు ఏమిటి?
 3. నాది ఏ రకమైన రక్తము? నేను ఇంజక్షన్ వంటివి ఏమైనా చేయించుకోవాలా?
 4. నేను త్వరగా అలసి పోతున్నాను. అది సహజమేనా?
 5. నాకు హానికరమైన ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే నేను ఏమి చేయాలి?

ముఖ్యమైన చర్యలు

Todoicon
పాయింట్లు
 1. నా రక్తపోటుని (BP) చూసుకోవాలి.
 2. ఐరన్ టాబ్లెట్ లు మరియు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ లు వాడుకోవాలి.
 3. కుషల్ వర్క్ షాప్ లో సమయం బుక్ చేసుకోవాలి
 4. డాక్టర్ దగ్గర గర్భసమయంలో చేయించుకోవాల్సిన చెకప్ చేయించుకోవాలి
 5. రక్తంలో రకాలు తెలుసుకోవాలి
 6. నా చేతులను ఎప్పుడూ సబ్బు మరియు నీళ్లతో కడుక్కోవాలి

మీకు ప్రశ్నలు ఉండవచ్చు

“గర్భంతో ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ రావడం అనేది చాలా అరుదు. అది 35 సంవత్సరాల లోపు రావడం ఇంకా అరుదు. కాకపోతే రొమ్ము లో మార్పులు అనేవి వస్తాయి. అవి బరువుగా గట్టిగా ఉంటాయి. మామూలుగా ఉన్నప్పటి వాటితో పోలిస్తే మీకేమైనా నొప్పితో కూడినది గడ్డలాగా ఉందనిపిస్తే డాక్టర్ దగ్గరకి వెళ్ళండి.”

“ఇదంతా నువ్వు మోస్తున్న అధిక బరువు వల్ల. ఆ భారం అంతా నీ ఎముకల మీద, కండరాల మీద పడుతుంది. అందువలన శరీరమంతా అలసిపోతుంది. దీనికి తోడు ఊపిరి తీసుకోవడం కూడా కష్టం గానే ఉంటుంది.”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి