30వ వారం

నీ శరీరం

changes in the body
ఏమి ఆశించను
"పద్ద పద్దాక బాత్ రూమ్ కి వెళ్ళవలసి వస్తుంది.దురద రావటం సహజం.మీరు డెలివరీకి సిద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఇది సమయం కాదు. ఎందుకంటే బిడ్డ ఇంకా ఎదగాల్సి ఉంది. మీకు నిద్రలో పిచ్చి పిచ్చి కలలు, నిద్ర పట్టని విధంగా ఉంటాయి.మీకు డెలివరీ గురించి బిడ్డ పుట్టుక గురించి ఆందోళనగా ఉంటుంది.బయట నలుగురిలో ఉన్నప్పుడు షాప్ కి వెళ్ళినప్పుడు ప్రసవం జరుగుతుందేమో అని భయపడతారు. ఇలాంటివి కలలో వచ్చి మిమ్మల్ని భయానికి గురి చేయవచ్చు గుర్తుంచుకోండి ఇవి కలలు మాత్రమే!"

మీ శిశువు పరిమాణం

Broccoli
ఏమి ఆశించను
బిడ్డ  బ్రోకోలి అనే ఒక ఒక కూరగాయ అంత పెద్ద పరిమాణంలో ఉంటుంది  (సుమారుగా 38 సెం. మి పొడవు మరియు 1200 గ్రాముల బరువు ఉంటుంది).

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించను
బిడ్డ తన వేళ్ళని బొటనవేలిని చీకగలదు, చప్పరించగలదు.బిడ్డ బొద్దుగా తయారవుతుంది. తన చర్మం చూడటానికి తక్కువ ముడుతలతో బాగా నున్నగా తయారవుతుంది.బిడ్డ కళ్ళు ఇప్పుడు బాగా చూడగలవు. తను లోపల బయట ప్రపంచాన్ని స్పష్టంగా చూడగలదు.బిడ్డ యొక్క చేతులు ఇప్పుడు పూర్తిగా తయారయ్యాయి. చేతి వేళ్ళకి గోర్లు కూడా పెరుగుతున్నాయి.

మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి

Mission pageTaking care 2Our services page
సూచనలు
 • కొవ్వుఎక్కువ ఉన్నవి, కారాలు, బాగా వేయించిన పదార్థాలు తినొద్దు. ఇవి తినకుండా ఉంటే గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉండదు. కడుపు చెడకుండా ఉంటుంది.
 • తిన్న వెంటనే పడుకోవద్దు. దీనివలన తిన్నది వెనక్కి రాకుండా ఉండిద్ది.
 • బిడ్డ కదలికలు ఎలా ఉన్నాయి అనేది టెస్టుల రూపంలో డాక్టర్ గారి దగ్గర నిర్ధారించుకోండి.
 • చర్మం మీద పడిన చారల కోసం విలువైన ఖరీదైన క్రీములు కొనవద్దు. అద్భుతంగా నయమయ్యేది ఏమీ లేదు. ఏదేమైనా దురదలు వస్తుంటే రాకుండా క్రీములు, లోషన్లు వాడాలి. కాలం గడిచేకొద్దీ చర్మం మీద చారలు వాటంతట అవే తగ్గుతాయి.
 • మీరు, మీ భర్త మీపొట్ట మీద తడిమి చూడండి. మీ బిడ్డ తిరిగి కొడుతుంది లేదా పొడుస్తుంది.  మీరు ఉన్నచోట మీ బిడ్డ తో ఆడుకోవటానికి ఇది బలే ఆట.

మీ డాక్టర్ని అడగవలసినవి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. బిడ్డ కదలికలు నాకు తరచుగా గమనిస్తుంటే తెలియట్లేదు అవి మామూలేనా?
 2. ముందస్తు ప్రసూతి లక్షణాలు ఎలా ఉంటాయి?
 3. ప్రసవం జరిగే సమయంలో నొప్పులను తట్టుకోవడానికి నాకై నేను ఏమి చేయాలి?
 4. నాకు అనిపిస్తుంది ఏ నిమిషంలోనైనా నేను ప్రస్తావిస్తానేమో అని ఇది మామూలేనా?
 5. నాకు స్పష్టమైన, భయంకరమైన కలలు వస్తున్నాయి. బాగా భయం, ఆందోళనకు గురి అవుతున్న. నేను ఏమి చేయాలి?

మీరు చేయవలసిన జాబితా

Todoicon
యాక్షన్ పాయింట్లు
 1. పిండం ఎన్నిసార్లు తంతుందో గమనించండి.
 2. కుషల్ వారి  వర్క్ షాప్ యొక్క సమయాలు తెలుసుకోవాలి.
 3. పోలిక్ యాసిడ్ మరియు ప్రసవం ముందు వాడవలసిన విటమిన్ మాత్రలను వాడుకోవాలి.
 4. గర్భసమయంలో చేయించుకోవాల్సిన చెకప్ కోసం డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి.
 5. హాస్పిటల్ బ్యాగ్ లో ఏమేమి సర్దు కోవాలో కావాల్సినవన్నీ చూసుకోవాలి.

బహుశా మీకు కలిగే ఇతర ప్రశ్నలు

"ప్రసవం జరిగే సమయంలో పరిస్థితి ఎలా ఉంటదో ముందే తెలుసుకుంటే మీకు ఎటువంటి భయాందోళనలు లేకుండా ఉంటారు. నింపాదిగా ప్రశాంతంగా ఉంటారు. నొప్పిని కూడా తట్టుకోగలరు. యోగాలో శ్వాసప్రక్రియకు సంబంధించిన వ్యాయామాలు ఉన్నాయి. అవి ఉపయోగపడతాయి. మీరు అప్పుడప్పుడు మోకాళ్ళ మీద కూర్చోవడం, వెనక్కి ముందుకి వూగటం, అటు ఇటు నడవడం వంటివి చేయండి."

"అది నువ్వు తీసుకునే ఆహారం వల్లనో లేదా చేసే పనుల వలన బిడ్డ తెల్లగా పుట్టడం అనేది ఒక మూఢనమ్మకం. బామ్మల కాలం నాటి కబుర్లు. చర్మపు రంగు లేదా సౌందర్యం అనేది జన్యుపరమైనవి. రకరకాల తినుబండారాల వల్ల మార్పు అనేది ఉండదు. మామూలుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. కొబ్బరినీళ్లు ఒంటికి నీరు శాతం పెంచడానికి ఉపయోగపడతాయి."

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి