31 వ వారం

నీ శరీరం

changes in the body
ఏమి ఆశించను
మీరు చివరి దశకు అనగా కాన్పు దశకు వచ్చేసారు ఇంకొక రెండు వారాలలో మీ బిడ్డ పెరిగే దశ ఆగిపోతుంది.మీ పొట్ట బిడ్డ కదలికలుకు కిందకి జరిగినట్లు అనిపిస్తుంది. అంటే దీని అర్థం మీ బిడ్డ సరైన పొజిషన్ లోకి వెళ్తుంది.ఇకనుంచి తరచుగా డాక్టర్  చెకప్ కు వెళ్లాల్సివస్తుంది. రక్తపోటుని చూడటం, పొట్ట చుట్టుకొలత చూడటం, బిడ్డ ఏ పొజిషన్లో ఉందో, అనుకూలంగా ఉందో అనేవి డాక్టర్ పరీక్షిస్తారు.ఊపిరి ఆడడం కష్టంగా ఉంటుంది.మీరు  మీ సెక్స్ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.

మీ శిశువు పరిమాణం

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 31వ వారం
ఏమి ఆశించను
మీ బిడ్డ పెద్ద కొబ్బరికాయ అంత పరిమాణంలో ఉంటుంది (సుమారుగా 40 సెం. మి పొడవు మరియు 1400 గ్రాముల బరువు ఉంటుంది)

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించను
మీ బిడ్డ బాగా నిద్ర పోతూ ఉంటుంది.  మీ బిడ్డ స్పర్శ, రుచి, చూపు, వినికిడి, ఆస్వాదన ద్వారా సమాచారాన్ని గ్రహించగలుగుతుంది. బిడ్డ చాలా హుషారుగా చుట్టూ గిరగిరా తిరుగుతూ, రకరకాలుగా వేళ్ళు చీకుతూ,  పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటుంది. బిడ్డ  బొద్దుగా తయారవుతూ ముడతలు కనిపించకుండా తయారవుతుంది.

మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 31వ వారం
సూచనలు
 • బ్రాక్స్టన్ హిక్స్ అనే సంకోచాల గురించి తెలుసుకోండి.  అప్పుడప్పుడు నకిలీ సంకోచాలు వస్తూ పోతూ ఉంటాయి. అవి పూర్తిగా మామూలే. మీ పొట్ట కండరాలు గట్టిపడి మడిచినట్లుగా ఒక 20 - 30 క్షణాలు ఉంటుంది. అది మళ్ళీ విశ్రాంతి పొందుతుంది. ఇవి హానికరమైనవి కావు. ఇవి సాధారణంగా జరిగే సంకోచాలు.
 • బాగా తినండి. మీ బిడ్డ వారానికి 200 గ్రాములు బరువు పెరగాలి.
 • ఇప్పటి నుండి  కుటుంబ సభ్యులు మరియు , ఇతర మనుషుల నుండి  సలహాలు, సూచనలు వస్తాయి. కొన్ని మంచివి, మరి కొన్ని చెడ్డవి. వాటివల్ల మీ మీద చెడు  ప్రభావం చూపకుండా చూసుకోండి.  మీరు  అనుకున్నది చేయండి మీ మనసు మార్చుకోవద్దు. మీరు  అనుకున్నది చేయండి/ పాటించండి. మీకు అందిన సమాచారం నిజమైనదా లేదా అనేది తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోండి.
 • తేలికపాటి  వ్యాయామాలు చేయండి - దీనివల్ల మెడ భాగంలో నొప్పులు తగ్గుతాయి. పట్టేసినట్లు ఉండవు.

మీ డాక్టర్ని అడగవలసినవి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. నాకు తరచుగా నొప్పితో కూడిన సంకోచాలు వస్తున్నాయి. నేను నేను హాస్పిటల్కి వెళ్లి చూపించుకోవాలా?
 2. ఉన్నట్లుండి నా మొఖం వుబ్బిపోయింది. తలనొప్పి కూడా వస్తుంది. ఇది ఏమైనా ఆందోళన కలిగించే విషయమా?
 3. స్పిటల్ కి ఎప్పుడు వెళ్లాలి?
 4. నా బిడ్డ యొక్క స్థితి / బయటకు వచ్చే పొజిషన్  బాగానే ఉందా?

మీరు చేయవలసిన జాబితా

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 31వ వారం
యాక్షన్ పాయింట్లు
 1. మొదటి కొన్ని రోజులలో  తల్లిపాలను ఇచ్చేటప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి.
 2. ముఖంలో వచ్చే మార్పులు అనగా ఉబ్బడం / వాచడం  గమనించుకుంటూ ఉండాలి.
 3. నా బరువుని ఎప్పటికప్పుడు గమనించుకోవాలి.
 4. కుషల్ వర్కుషాపు లో పాల్గొనడానికి సమయం తెలుసుకుని బుక్ చేసుకోవాలి.
 5. నేను వాడవలసిన విటమిన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలను తప్పనిసరిగా వేసుకోవాలి.
 6. డాక్టర్ దగ్గర చెకప్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలి .

బహుశా మీకు కలిగే ఇతర ప్రశ్నలు

"మీరు ఇప్పటికీ ఆరోగ్యకరమైన సెక్స్ జీవితాన్ని ఆనందించవచ్చు. ఇది మీకు, మీ భర్తకి మధ్య దృఢమైన బంధం ఏర్పరుస్తుంది. సెక్స్ సురక్షితమైనది మీకు, మీ భర్తకి  వీలుగా ఉన్న విధానం చూసుకుని ఆనందించవచ్చు.  మీరు ఒక పక్కకి తిరిగి పడుకుంటే మంచిది.   మీ నడుము  కింది భాగంలో ఏమైనా ఒత్తిడి పడుతుంటే మోకాళ్ళ మధ్యలో దిండుని పెట్టుకోండి."

"సిజేరియన్ అనేటువంటిది పెద్ద ఆపరేషన్. ఇది ఇబ్బందులతో కూడుకున్నది.  అందుకని ప్రాణం మీదకు వస్తే తప్ప అనగా - మీకు, మీ బిడ్డకు ఇద్దరికీ మంచిది అంటే తప్ప చేయించుకోవద్దు.  తప్పనిసరి అయితే తప్ప అలాంటి ఆపరేషన్లు చెయ్యరు.
నేను బిడ్డను కనడానికి భయపడుతున్నాను అని మా డాక్టర్ గారికి చెప్పగా వారు ప్రసవ సమయంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఎలాంటి సహకారం అందిస్తారు అనేది నాకు తెలియచేసి దైర్యం చెప్పారు."

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి