37వ వారం

నీ శరీరం

changes in the body
ఏమి ఆశించను
మీరు ఇపుడు నిండు గర్భిణీ. మీకు నెలలు నిండాయి. ఇందుకు మీకు శుభాకాంక్షలు! బిడ్డ ఇపుడు జన్మించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇంకా రోజులు ఎదురు చూడవలసి ఉంది . ఒకవేళ మీరు కవలలు ఉన్న గర్భిణీఅయితే మీరు ఇంకో వారంలోనే కంటారు. ఒకవేళ ఇది మీ మొదటి గర్భిణీ కాకపోతే బిడ్డ ప్రసవం వరకు కిందకు దిగదు. మీరు మీ రొమ్ముల నుండి ఎదో నీరు వంటిది కారడం గమనిస్తారు. ఇది సహజమే. మీకు యోని నుండి స్రావాలు ఎక్కువగా వస్తుంటాయి. మీరు కొంచెం ఉద్వేగభరితంగా ఉంటారు ఈ సమయంలో - మీకు అంతా బాగానే ఉంటుంది మరియు బిడ్డ వచ్చే క్షణాల కోసం వేచిఉంటారు.

మీ శిశువు పరిమాణం

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 37వ వారం
ఏమి ఆశించను
బిడ్డ ఇపుడు పెద్ద పనసకాయ అంత పరిమాణంలో ఉంటుంది (సుమారుగా 47 సెం. మి పొడవు మరియు 2.8 కేజిల బరువు ఉంటుంది).

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించను
బిడ్డ ఈ ప్రపంచంలోకి ఏ రోజైన రావచ్చు! బిడ్డ చక్కగా పెరిగింది మరియు బయట ప్రపంచంలో బ్రతకడానికి సిద్ధంగా ఉంది. బిడ్డ సాధారణంగా తల కిందకి ఉంటుంది. 95% బిడ్డలు ఈ పొజిషన్లోనే ఉంటారు. బిడ్డ ముఖ కవళికలు సాధన చేస్తుంది. అనగా కోపం, నవ్వు వంటి కవళికలు. మరియు వారు నిదానంగా ఏడవడం వంటివి. కంగారు పడవద్దు ఇది సంతోషానికి, బాధకి సంబంధించినది కాదు.

మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 37వ వారం
సూచనలు
 • ప్రసవం యొక్క గుర్తులు తెలుసుకోండి.
 • మీరు ఆసుపత్రి కి ఎపుడు వెళ్లాలో తెలుసుకోండి
 • మీరు కింద కుర్చునేటపుడు మీ తుంటితో మరియు మోకాలితో ముందు సాగడానికి ప్రత్నించండి. కొందరు చెప్పారు ఈ విధంగా చేయడం వలన బిడ్డ కరెక్ట్ పొజిషన్లోకి వస్తుందని.
 • రోజుకు 8 గ్లాసుల నీరు తాగడం ఆపకండి.
 • మీరు రోజువారీ చేసే పనులు చేయడంలో నీకు కొంత కంగారు ఉండవచ్చు. మీ భర్తను మీకు సహాయం చేయమని అడగండి.
 • వైద్యులు మీకు బెడ్ రెస్ట్ తీసుకోమని సలహా ఇస్తే దాని ప్రకారం మీ పనులు ప్లాన్ చేసుకుని విశ్రాంతిలో ఉండండి. మీకు దగ్గరలో ఫోన్, పుస్తకాలూ, మాగజైన్ మరియు టీవీ రిమోట్ ను మీ చేతి దగ్గరలో ఉంచుకోండి.
 • మీరు ఎక్కువసేపు నిద్రపోలేరని ఎవరైనా అంటే కోపగించుకోకండి. వారు మీకు విశ్రాంతి తీసుకోవాలని చెప్తున్నారు. మీకు ఇపుడు వ్యక్తిగత సలహాలు ఇస్తారు.
 • ప్రసవం రోజు ఏమి జరుగుతుంది అనేది ముందుగా తెలుసుకోండి. ఇలా తెలుసుకోవడం వలన మీకు భయపెట్టే ఆలోచనలు వంటివి రాకుండ ఉంటాయి .

మీ డాక్టర్ని అడగవలసినవి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. నా బిడ్డ ఉండవలిసిన స్థానం / స్థితి లోనే ఉందా?
 2. ప్రసవం యొక్క గుర్తులు ఏమిటి?
 3. నాకు కొంచెం ఆతృతగా / కంగారు ఉంది. ఏమి చేయాలి ?
 4. ప్రసవ సమయంలో నొప్పి తగ్గించుకోవడానికి నాకు ఏమైనా సలహాలు ఉన్నాయా ?
 5. నేను ఇపుడు స్కాన్ చేయించుకోవాలా?

మీరు చేయవలసిన జాబితా

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 37వ వారం
యాక్షన్ పాయింట్లు
 1. హాస్పిటల్కి వెళ్ళడానికి రవాణా సదుపాయాలు చూసుకోవాలి
 2. చేతిలో అందుబాటులో ఉండేలాగా ఎమర్జెన్సీ మరియు ముఖ్యమైన వారి ఫోన్ నంబర్స్ సిద్ధంగా ఉంచుకోవాలి
 3. పుట్టబోయే బిడ్డకి సంబంధించి వస్తువులు అనగా బట్టలు మరియు పడుకోపెట్టడానికి కావలిసిన సదుపాయాలు సిద్ధం చేసుకోవాలి
 4. డాక్టర్ గారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి
 5. నా భర్తతో ప్రసవం గురించి మరియు ఎటువంటి సహకారం తన నుండి నేను ఆశిస్తుంది తనతో చెప్పుకోవాలి.

బహుశా మీకు కలిగే ఇతర ప్రశ్నలు

"ప్రసవం ప్రారంభమవుతుంది అనడానికి చాల గుర్తులు ఉన్నాయి - నొప్పులు, షో అనగా ఉమ్మనీరు బయటకి రావడం . ఈ నీరుబయటకి వస్తున్నపుడు భయంకరమైన నడుమునొప్పి వస్తుంది. చాల మందికి ఉమ్మనీరు బయటకి వచ్చిన 24 గంటలలోపు ప్రసవంజరుగుతుంది."

"ఎక్కువ శాతం మందికి ఎపిజియోటామి అనేది జరగదు. ఇది వరకు రోజుల్లో ఇలా కట్ చేయడం అనేది సాధారణం. ఎందుకంటే ప్రసవంత్వరగా జరగడానికి యోని భాగం ఎక్కువగా చిరిగిపోకుండా ఉండటానికి ఇలా చేసేవారు. ఏది ఏమైనా కొన్ని కొన్ని పరిస్థితులలో బిడ్డగుండె చప్పుడు తగ్గుతున్నపుడు , కాన్పు త్వరగా జరగవలిసిన పరిస్థితులలోను ఈ పద్దతి వాడుతారు."

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి