గర్భిణీ స్త్రీలు అసాధారణమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు

pregnancy related anxiety in COVID - 19

భారతదేశంలో COVID - 19 ఉన్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.హిందూ పత్రిక నివేదికల ప్రకారం(www.thehindu.com)  కరోనావైరస్ వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షించిన వారిలో పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య మూడు రోజుల పాటు రోజుకు దాదాపు 2000 గా ఉంది.రాష్ట్రంలో ఇప్పటివరకు 408 COVID - 19 సంబంధిత మరణాలు  జరిగాయి అని ఆరోగ్య శాఖ నిర్ధారించింది.ప్రస్తుతం కుషల్ పనిచేస్తున్న కృష్ణాజిల్లా నందు COVID - 19 సంబంధిత మరణాల రేటు 3.17%  గా ఉంది.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు చాల ఆందోళనలో ఉన్నారు మరి ముఖ్యంగా గర్బీణీలు పడుతున్న ఆందోళన గురించి చెప్పనవసరం లేదు. సాధారణ పరిస్థితులలో కన్నా ప్రస్తుతం గర్భిణీలు ప్రసవానికి సంబంధించిన ఆందోళనలు  మరియు బాలింతలలో  (ప్రసవించిన తరువాతి మొదటి 3 నెలలు) ఆందోళన రుగ్మతలు ఉన్నాయి - (ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ గైనకాలజిస్ట్స్ మరియు ప్రసూతి వైద్యులు) మరియు ముందెన్నడూ ఇటువంటివి వారికీ సంభవించి ఉండవు.

చాలా కఠినమైన లాక్ డౌన్ జరగడం వలన యాంటినేటల్ (గర్భసమయంలో) చెకప్ కూడా అందుబాటులో లేకపోవడం వలన లబ్ధిదారులు (గర్భిణీ స్త్రీలు )  వారికీ కావలసిన సహాయ సహకారాలు  మరియు సూచనలు అందుబాటులో లేకపోవడం వలన చాలా మంది  ఆందోళన చెందారు. ఈ ప్రాంతం నందు గర్భిణీ స్త్రీలకు మానసిక మరియు భావోద్వేగ సంబంధిత ఆరోగ్యం పట్ల  విషయాలను తెలియచేయడానికి   కుషల్ ఇండియా మాత్రమే ఏకైక సర్వీస్ ప్రొవైడర్ గా ఉంది. మాకు ఎటువంటి ఫండింగ్ ( ఆర్ధిక సహకారం) లేనప్పటికీ ఈ గ్యాప్ను పూరించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము.  రాష్ట్రము నందు గల అన్ని ప్రాంతాలలోని అంగన్వాడీ సెంటర్స్ నందు   వెనుక బడిన వర్గాల మహిళలకు అందచేయబడే  ప్రభుత్వ యాంటినాటల్ సదుపాయాలు కూడా  మూసివేయబడినాయి. మేము మరి కొన్ని వారాలలో ఈ వర్గానికి / ప్రాంతానికి చెందిన 700మంది గర్భిణీ స్త్రీలను  స్నేహపూరితమైన కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా చేరుకోబోతున్నాము.

ముందు వరుసలో పనిచేసే మా సహోద్యోగులు ఈ రోజుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న ప్రశ్న –

“అమ్మా ఒక వేళ నాకు కరోనా వైరస్ సోకితే నా  ద్వారా నాకు పుట్టబోయే బిడ్డకి ఈ వ్యాధి సంక్రమిస్తుందా ? లేదా ఈ వ్యాధి వలన భవిష్యత్తులో నా పిల్ల్లలకు ఏదైనా సమస్యలు  లేక వైకల్యం వచ్చే అవకాశం ఉందా? మా అత్తగారు ఈ గర్భిణీ వద్దని తీపించేయమని  సలహా ఇస్తున్నారు. ”

నిజమైన సమాచారాన్ని తెలుసుకోవడంలో కలుగుతున్న ఇబ్బంది ఇంకా  మీడియా వారు ప్రచురించిన హెడ్ లైన్స్ మరియు  తప్పుడు సమాచారం  ప్రజలలో అపోహలు, భయాలు ఎక్కువ అవడానికి కారణమయ్యాయి. మన లబ్ధిదారులలో ఎక్కువ మంది మొదటి సారి  గర్భం ధరించిన వారు మరియు వయసులో ఉన్నవారు. ఈ అపోహలు, మరియు భయాల కారణంగా ఎక్కువ మంది వత్తిడికి గురి అయి గర్భం తీయించుకునే పరిస్థితికి దారితీస్తున్నాయి.

మేము తప్పనిసరిగా మహిళలకు సలహా ఇచ్చేలా చూస్తాము –

  • COVID-19 మహమ్మారి వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి మరియు ప్రతి రోజు శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు వైరస్ యొక్క ప్రభావాన్ని ఎలా నిరోధించాలో మరియు తగ్గించవచ్చో మరింత తెలుసుకుంటున్నారు. దాదాపుగా ప్రతి రోజు క్రొత్త సమాచారం బయటకు వస్తుంది మరియు కొన్ని సమయాల్లో మునుపటి సమాచారానికి మరియు కొత్త సమాచారానికి పొంతన ఉండటలేదు ( విరుద్ధంగా ఉంటుంది). కాబట్టి ఎప్పటికపుడు కొత్త సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
  • ఏది ఏమైనా మీరు ఖచ్చితమైన ఆధారం గల వాటి నుండి మాత్రమే సమాచారాన్ని తెలుసుకోవాలి ఉదాహరణకి :  WHO(డబ్ల్యూ.హెచ్.ఓ) , UNICEF(యునిసెఫ్ ) మరియు National Health Mission (నేషనల్ హెల్త్ మిషన్)
  • మీరు మీడియాలో మరియు ప్రత్యేకించి యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో  ఆసక్తి కలిగించే లేదా ఆందోళన కలిగించే సమాచారాన్ని చూసినట్లయితే, దయచేసి ఆ సమాచారాన్ని నమ్మకమైన మరియు ఖచ్చితమైన ఆధారం ఉండి తెలుపుతున్నవేనా అని దృవీకరించుకోండి. ఎప్పుడూ కూడా ఒక సమాచారాన్ని ఒక మీడియాలో/ ఒక సమాచార వ్యవస్థ నుండి  చూసి పాటించవద్దు.
  • ఏమైనా చర్యలు లేదా నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి. మీ సందేహాలను ధృవీకరించండి. ముందుగా మీ వైద్యుడిని సంప్రదించండి.

మా COVID -19 సంబంధిత కార్యకలాపాల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

2 thoughts on “గర్భిణీ స్త్రీలు అసాధారణమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి